ఆ గులాబీ పీఠం ఎవరికి దక్కేనో..!

MOHAN BABU
రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే మరింత పటిష్టం చేసేందుకు గ్రామ,మండల స్థాయిలో అధ్యక్ష ఎన్నికకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మండల అధ్యక్ష పీఠం ఎవరికి దక్కేనో అనే సర్వత్రా ఆసక్తి మండల ప్రజల్లో నెలకొంది. మండల అధ్యక్ష పదవి కోసం పలు పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకునే వారిలో ఆశావాహులు ఊహల పల్లకిలో కలలు కంటున్నారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మండల అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు.

 గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మండల అధ్యక్షుడిగా ఎన్నిక కాగా ప్రస్తుత అధ్యక్షుడు ఏ సామాజికవర్గం నుంచి ఎన్నిక అవతారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మండలంలో దాదాపు గిరిజన సామాజికవర్గం ఎక్కువగా ఉండగా ఇందులో దాదాపు ఇద్దరు, ముగ్గురు మినహా ఎక్కువమంది ఇదే సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు ఉండడంతో గిరిజన సామాజికవర్గం నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ గులాబీ గూటికి చేరడంతో మండల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

గత ఎన్నికల్లో తన గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తన అనుచరులు పానుగంటి రాధాకృష్ణను మండల అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు కుమారుడిపై ఓ కేసు విషయంలో పార్టీ అభాసుపాలు అయిందని వాదనతో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నారు. మొదట టిడిపిలో ఉన్న ఎమ్మెల్యే హరిప్రియ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలవడం, వెంటనే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మండలంలో టిడిపి నుంచి అధికార పార్టీ లోకి వచ్చిన ప్రజాప్రతినిధులు కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన తన మాజీ అనుచరులు వైసీపీ నుంచి గులాబీ గూటికి చేరిన నాయకులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: