ఊరుకునే ప్రసక్తే లేదు, ప్రభుత్వానికి మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Sahithya
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బందరు పోర్టు నిర్మాణంలో నవయుగ సంస్థను కొనసాగిస్తే నేడు మచిలీపట్నం పోర్టుకు షిప్ వచ్చేది అన్నారు ఆయన. వైసీపీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడి బందరు పోర్టును బలి చేస్తున్నారు అని ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేసారు. బందరు పోర్టు కోసం టీడీపీ భూసమీకరణ చేస్తే రైతులకు ఎదో అన్యాయం జరిగిపోతుందని వైసీపీ నాయకులు నానాయాగీ చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
పోర్టు నిర్మాణంపై మంత్రి పేర్ని నాని డబ్బా కొడుతున్నారు అని రవీంద్ర మండిపడ్డారు.  మరి పోర్టు పనులు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు ? అని ప్రశ్నించారు. బందరు ఎంపి బలసౌరి చుట్టం చూపుకువచ్చినట్లు మచిలీపట్నం వస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ హయాంలో రైతులకు ఎకరాకు 25 లక్షలు ఇచ్చాం  అన్నారు ఆయన. మీరు కూడా రైతులకు డబ్బులు ఇచ్చి పనులు ప్రారంభించండి అని సవాల్ చేసారు. పోర్టు భూములను తాకట్టు పెట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు అన్నారు ఆయన.
గంగవరం పోర్టు అమ్మేసిన మీరు మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేస్తారని అనుకోవడం ప్రజల భ్రమ అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు కమిషన్లకు భయపడి ఎవరు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు అన్నారు. బందరు పోర్టు కోసం టీడీపీ పూర్తిగా సహకరిస్తుంది... మీరు పోర్టు నిర్మాణం చేయండి అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. బందరు అభివృద్ధికి టీడీపీ హయాంలో మూడాను ఏర్పాటు చేసే వైసీపీ నేతలు దానిని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు అన్నారు రవీంద్ర. పోర్టు పేరుతో మచిలీపట్నం ప్రజల ఆశలతో ఆడుకోవాలని చూస్తే సహించేది లేదు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: