ఓవ‌ర్ టు జ‌గ‌న్ : ఆట ఆగిపోయింది స‌ర్ ఆదుకుంటారా?

RATNA KISHORE
ప్ర‌తిరోజూ కూలి ప‌నుల‌కు పోయే క‌ళాకారులు వారు. బాధ్య‌త‌గా మెలిగి కుటుంబాల‌ను పోషిస్తున్న సంద‌ర్భంలో వీరికి తాము న‌మ్ముకున్న క‌ళే మృత్యు పాశ‌మైంది. చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ జీవ‌నం  సాగించే వీరి ఆయువు అర్ధంత‌రంగా ఆగిపోయింది. ప‌ల్లెల్లో ఆనందాల‌కు కార‌ణం అయ్యే ఆ ఇద్ద‌రు క‌ళాకారుల కుటుంబాల‌కు ఇది తీర‌ని శోకం. జ‌గ‌న్ స‌ర్! మీరు ఆదుకోండి. వారి బాధ్య‌త మీరు తీసుకోండి.


కోల సంబరం.. వినాయక ఉత్స‌వాలకు ప్ర‌త్యేకం. గోదావ‌రి జిల్లాల‌లో ఇదే ఆధారంగా బ‌తికే కుటుంబాలు ఉన్నాయి. ఆట ఆడుతూ ప్రాణాలు కోల్పోవ‌డ‌మే ఇప్ప‌టి విషాదం. ఆగిన గుండె స‌వ్వ‌డి..ఉత్స‌వం ఇచ్చిన విషాదం. ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంకు ఉం ది ? చేస్తుందా? చ‌వితి ఉత్స‌వాలు విఘ్నాలు తొల‌గించాలి కానీ విషాదాన్ని ఇచ్చాయి. బ‌తుకును ప్ర‌శ్నార్థకం చేశాయి. ఆ రెండు కు టుంబాల‌కు పెద్ద దిక్కు లేకుండా చేశాయి. తూర్పు గోదావ‌రి వాకిట విషాదం గుండె త‌రుక్కుపోయేలా చేస్తోంది. కోల సంబరంలో పా ల్గొన్న ఇద్ద‌రు క‌ళాకారులు విద్యుదాఘాతంతో మ‌ర‌ణించారు. కుటుంబాల‌ను రోడ్డున‌ప‌డేసిన ఘ‌ట‌న కాజులూరు మండ‌లంలో చోటు చేసుకుంది.వానం శెట్టి శ్రీ‌నివాస్ (30), మేడిశెట్టి శ్రీ‌నివాస‌రావు(47) ఈ ఇద్ద‌రూ నిన్న గ‌ణేశ్ మండ‌పంలో కోట సంబరంలో పాడేందు కు ,ఆడేందుకు వ‌చ్చారు. సంబ‌రం మ‌రి కాసేప‌ట్లో ముగిసిపోనుంది. ఇంత‌లో వీరు ప‌ట్టుకున్న మైక్ విద్యుత్ షాక్ కు కార‌ణ‌మైంది.


వెంట‌నే వారిని యానాం ఆస్ప‌త్రికి త‌రలించినా ఫ‌లితం లేదు. ఈ ఇద్ద‌రూ అతి పేద కుటుంబాల‌కు చెందిన క‌ళాకారులు. కుటుంబ పోష‌ణే వీరికి అత్యంత భారం. ఈ ద‌శ‌లో వానంశెట్టి శ్రీ‌నివాస్ తల్లీ తండ్రీ ఆల‌నా పాల‌నా రేప‌టి నుంచి ఎవ‌రు చూస్తారు. తండ్రికి క్యాన్స‌ర్, త‌ల్లికి ప‌క్ష‌వాతం. వారికి ఈయ‌నే ఆధారం. మ‌రో బాధితుడి కుటుంబం కూడా ఇలాంటిదే. ఆయ‌న‌కు భార్య‌, కుమార్తె ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: