వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే... వార్ ముదురుతోందిగా....!

VUYYURU SUBHASH
తూర్పుగోదావ‌రి జిల్లాలో వైసీపీ రాజ‌కీయాలు రోడ్డెక్కుతున్నాయి. కీల‌క నేత‌లు.. అందునా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఎంతో సన్నిహితులుగా పేరున్న యువ నాయ‌కులు చీటికీ మాటికీ కీచులాడుకుంటున్న ప‌రిస్థితి పెరుగుతోంది. ఈ వివాదాలు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇసుక అక్ర‌మాల వ‌రకు ప‌రిమితం కాగా.. ఇప్పుడు.. చాలా దూర‌మే వెళ్లాయి. దీంతో అస‌లు ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. వైసీపీకి తీవ్ర డ్యామేజీ ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా.. త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక‌, రాజ‌మండ్రి నుంచి తొలిసారి ఎన్నికైన పార్ల‌మెంటు స‌భ్యుడు.. యువ నాయ‌కుడు.. మార్గాని భ‌ర‌త్ కూడా.. త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
అయితే.. ఎవ‌రికివారు రాజకీయం చేసుకుంటే.. ఇబ్బందులు ఉండేవి కావు. కానీ, గోదావ‌రిలో జ‌రుగుతున్న ఇసుక అక్ర‌మాల వెనుక రాజా ఉన్నారంటూ.. కొన్ని నెల‌ల కింద‌ట బాహాటంగానే ఎంపీ విమ‌ర్శించారు. ఇదే విష‌యంపై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల‌కు కంప్లెయింట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇక‌, అప్ప‌టి నుంచి రాజా వ‌ర్సెస్ మార్గానిరాజ‌కీయాలు.. నిత్యం వివాదాలు.. విమ‌ర్శ‌ల‌తోనే సాగుతోంది. తాజాగా ఓ ద‌ళిత టీచర్‌పై.. ప్ర‌సాద‌రాజు అనే వ్య‌క్తి దాడి చేశాడు. దీనిని ఎంపీ మార్గాని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. స‌ద‌రు ప్ర‌సాద‌రాజును అరెస్టు చేసే వ‌ర‌కు త‌ను విశ్ర‌మించేది లేద‌ని ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. దీనికి సంబంధించి పోలీసు ఉన్న‌తాధికారుల‌కు కూడా ఆయ‌న ఫిర్యాదు చేశారు.
అయితే.. ప్ర‌సాద‌రాజు.. జ‌క్కంపూడి రాజాకు స్నేహితుడు. దీంతో ఇది రాజ‌కీయ దుమారానికి దారితీసిం ది. ప్ర‌సాద‌రాజుకు అనుకూలంగా.. రాజా వ‌ర్గం.. వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిని మార్గాని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు. దీంతో రాజా.. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ.. మార్గానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాదు.. ఇదే వైఖ‌రి కొన‌సాగితే.. నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేవంటూ.. హెచ్చ‌రించారు. దీంతో మార్గాని కూడా ఇంతే రేంజ్‌లో ఫైర‌య్యారు. విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దాకా తీసుకువెళ్తాన‌ని.. రాజాను బ‌హిరంగంగానే హెచ్చ‌రించారు.
దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే రాజ‌కీయ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక‌, ఇదే విష‌యంపై స్థానిక నేత‌లు.. ముఖ్యంగా ఇటీవ‌లే ఎమ్మెల్సీ అయిన‌.. మోషేన్ రాజు వంటి వారు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ఇరువురు నాయ‌కులు స‌ర్దు బాటు కాలేదు. దీంతో ఈ విష‌యాన్ని వైవీ సుబ్బారెడ్డికి చెప్పి స‌ర్దు బాటు చేయించాల‌ని చూస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ప్ర‌జా బ‌లం ఉన్న యువ నాయ‌కులు ఇలా రోడ్డున ప‌డి విమ‌ర్శ‌లు , హెచ్చ‌రిక‌లు చేసుకోవ‌డం.. ప్ర‌తిప‌క్షాలు పుంజుకునేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: