ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన నిల‌బ‌డుతాయా..?

Paloji Vinay
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు నేడు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్ఆర్సీపీ ప‌రీక్ష‌గా ఉండ‌నుంది. ప‌రోక్షంగా టీడీపీ పోటీలో లేద‌ని చెప్పాలి. దీంతో బీజేపీ, జ‌న‌సేన పార్టీలు మాత్ర‌మే జ‌గ‌న్ కు పోటీ ఇవ్వ‌నున్నాయి. అయితే, ఇది వైసీపీ పెద్ద స‌మ‌స్య కాదు. కానీ, ఇది ఆ పార్టీకి ఒక ప‌రీక్ష లాంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే అత్య‌ధిక ఎమ్మెల్యేల‌తో అధికారంలో ఉన్న జ‌గ‌న్ పార్టీ దాదాపు 95 శాతం స్థానాలు పొందితేనే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త లేద‌ని చెప్పొచ్చు.


 టీడీపీ నాయ‌కులు చూస్తున్న ప్రాంతాల‌లో వైసీపీ ఓడిపోతే మాత్రం అది జ‌గ‌న్‌కు పెద్ద దెబ్బే అని అంటున్నారు. 80 శాతం కంటే త‌క్కువ‌గా వైసీపీకి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాలు మాత్రం వ‌స్తే వైసీపీ ఓడిపోయింద‌నే చెప్పుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.    మొత్తానికి వైసీపీ రాబోయే ఎన్నిక‌ల ముందు తొలి ప‌రీక్ష కానుంద‌ని తెలుస్తోంది. అలాగే భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన ల‌కు కూడా ఇది ప‌రీక్ష కానుంది. జ‌న‌సేన కు ఇది మొట్ట‌మొద‌టి అధికారిక విజ‌యం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో న‌మోదు కానుంద‌ని తెలుస్తోంది.


 2019లో జ‌రిగిన ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్ర‌మే గెలుచుకుంది. కానీ, త‌రువాత ఆ ఎమ్మెల్యే కాస్త వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే, స్తానిక ఎన్నిక‌లయిన కార్పొరేష‌న్ వాటిల్లో జ‌న‌సేన అడుగు పెట్ట‌డం వేరు గ్రామీన స్థాయిలో జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం వేరు.
 పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసిన‌ప్ప‌టికీ అది జ‌న‌సేన‌కు గుర్తుపై కాదు. కార్పోరేష‌న్లలో అడుగు పెట్టిన బీజేపీ, జ‌న‌సేన అక్క‌డ‌క్క‌డ విజ‌యం సాధించింది. అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం పోటీలో లేనందున బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు గ్రామీణ స్థాయిలో ఏ విధంగా స‌పోర్ట్ ఉంది అనే విష‌యం ఈ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా తెలిసిపోతుంది.
   
   
   
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: