అసలు సిసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో చూపిస్తా: లోకేష్ కామెంట్

Sahithya
ఏపీలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం పట్ల ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. తాజాగా డీజీపీ కార్యాలయ గేట్లను నేట్టివేసారని పోలీసులు కేసులు నమోదు చేసారు. టీడీపీ నేతలు డీజీపీ కి వినతీపత్రం ఇచ్చేందుకు వెళ్ళగా వారి మీద కేసులు నమోదు చేసారు. తాడేపల్లి ఏ ఎస్ ఐ మధుసూదన రావు టీడీపీ నేతల మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసారు. మొత్తం అయిదు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు. అలాగే 11 మంది టీడీపీ నేతల మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వివాదాస్పదం అయింది.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు. ప్ర‌మాణ‌స్వీకారం రోజు నుంచే రివ‌ర్స్ పాల‌న ఆరంభించి రాష్ట్రాన్ని అధోగ‌తి పాలుచేసిన జ‌గ‌న్‌రెడ్డి, రివ‌ర్స్ టెండ‌ర్లు మీదుగా ఇప్పుడు రివ‌ర్స్ కేసుల వ‌ర‌కూ వ‌చ్చారు అని ఆయన ఆరోపించారు. జెడ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త వున్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారి పై దాడి చేసేందుకు పోలీసులు సాయంతో ఇంట్లోకి చొర‌బ‌డిన‌ వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అత‌ని గూండాల అకృత్యాలు ప్ర‌పంచ‌మంతా చూసింది అని అన్నారు ఆయన.
తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితులైన‌ టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్తే ..రివ‌ర్స్‌గా వారిపైనే నాన్‌బెయిల‌బుల్, జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆయుధ‌మైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు బ‌నాయించారు అని ఆయన ఆరోపించారు. చంద్ర‌బాబు గారి ఇంటిపై దాడిచేసి, టీడీపీ త‌ల్ని గాయ‌ప‌రిచిన‌ నిందితులైన వైకాపా ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కి స్టేష‌న్ బెయిల్ రేంజు కేసు పెట్టి రివ‌ర్స్ పోలీసింగ్‌ అంటే ఏంటో చూపించారు అన్నారు ఆయన. బాధితుల్ని బంధిస్తూ..ముద్దాయిల్ని ముద్దుగా చూసుకుంటోన్న ఈ వైపీఎస్ ఆఫీస‌ర్లు రెండున్న‌రేళ్ల‌లో రిటైర్ అవ్వ‌రు క‌దా అని ఆయన కామెంట్ చేసారు. జ‌గ‌న్ క్రిమిన‌ల్ స్కూల్ లా అమ‌లు చేస్తోన్న వీరికి అస‌లు సిస‌లు లా అండ్ ఆర్డ‌ర్ అంటే ఏంటో రాబోయే రోజుల్లో నేర్పిస్తాం అన్నారు లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: