పవన్ దిగితే ‘జోగి’కి ఇక కష్టమే...?

M N Amaleswara rao
జోగి రమేష్....గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్న నాయకుడు. మామూలుగానే జోగి ఫైర్ బ్రాండ్ నాయకుడు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడతారు. కానీ ఈ మధ్య జోగి ఫైర్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫైర్ అంతా మంత్రి పదవి దక్కించుకోవడం కోసమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదట విడతలోనే పదవి రావాల్సిందని, కానీ అప్పుడు మిస్ అయిందని, కానీ ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని జోగి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే జోగి దూకుడుగా మాట్లాడుతున్నారని, మీడియా సమావేశాల్లోనే కాదు...అసెంబ్లీలో సైతం పరుష పదజాలం వాడుతూ హైలైట్ అయ్యారని చెబుతున్నారు. ఇక తాజాగా టి‌డి‌పి నేత అయ్యన్నపాత్రుడు, జగన్‌ని తిడితే, జోగి ఏమో చంద్రబాబు ఇంటి దగ్గర హడావిడి చేశారని, అక్కడేమో టి‌డి‌పి-వైసీపీ శ్రేణుల మధ్య రచ్చ జరిగిందని, అంటే అనవసరంగా జోగి రాజకీయం చేస్తూనే, తనపైనే ఫోకస్ అయ్యేలా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఏ నాయకుడు కూడా బాబు ఇంటికెళ్ళి రచ్చ చేయలేదని, కానీ జోగికే ఎందుకు అలా అనిపించిందో అర్ధం చేసుకోవచ్చని మాట్లాడుతున్నారు.
దీని వల్ల అయ్యన్న మాటలు కంటే జోగి చేసిన రచ్చే బాగా హైలైట్ అయిందని చెబుతున్నారు. ఇలా మంత్రి పదవి కోసం జోగి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఇలా అమరావతి దగ్గర హడావిడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
పెడనలో రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉందని, అక్కడ అభివృద్ధి పనులు పెద్దగా జరగడం లేదని, పైగా జోగి అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు పెరిగాయని, దీంతో జోగికి పెడనలో వ్యతిరేక గాలులు వీయడం మొదలైందని, నెక్స్ట్ ఎన్నికల్లో జోగికి టఫ్ ఫైట్ తప్పదని అంటున్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గానీ టి‌డి‌పితో జట్టు కడితే...పెడనలో జోగికి గెలుపు కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: