రేపు, ఎల్లుండి వైన్స్‌ బంద్ !

Veldandi Saikiran
వినాయక నిమజ్జనం నేపథ్యం లో రేపు, ఎల్లుండి వైన్స్‌ మూసి వేయాలని సీపీ అంజనీకుమార్  ఆదేశాలు జారీ చేశారు.  రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు వైన్స్‌ మూసివేయాలని పేర్కొన్నారు.  వినాయక నిమజ్జనానికి డీజే లకు అనుమతి లేదని... గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామమన్నారు.  2020 లో కరోనా కారణంగా నిమజ్జనాలు జరగలేదని.. ఈ ఏడాది మొదటి సారిగా పీవీ మార్గ్ లోకూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
2.5 లక్షలు గణేష్ విగ్రహాలను ghmc ద్వారా అందజేశారని... దీంతో చాలా విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారని స్పష్టం చేశారు.  27 వేల మంది పోలీసులు బలగాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశామని... రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తో నిఘా కట్టుదిట్టం చేశామని వివరించారు.  సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని.. అనుభవం ఉన్న పోలీస్ అధికారులను నగరంలో ఇంచార్జ్ లు గా నియమించామన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం మొత్తం పర్యవేక్షణ కొనసాగుతుందని.. నగరంలో దాదాపు 8175 రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.
నాలుగు అడుగులు లోపు ఉన్న విగ్రహాలు 45 కి పైగానే నిమజ్జనం జరగవచ్చు అని అంచనా వేస్తున్నామని... ghmc , వాటర్ వర్క్స్, పొలుసులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశామన్నారు. నగర వ్యాప్తంగా 55 స్టాస్టిక్ క్రైన్స్ ఏర్పాటు చేశామని... 50 అంబులెన్స్ లను కూడా నగరంలో అలెర్ట్ చేసి ఉంచామని తెలిపారు. సిపి కార్యాలయం లో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని... మహిళ భద్రత కోసం అడిషనల్ సిపి షికాగోయల్ నేతృత్వం లో షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. గణేష్ ఉత్సవ సమితి వాలంటరీ సభ్యులు ద్వారా నిమజ్జనం శాంతి యుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: