విబేధాలు ముదిరాయి...

విబేధాలు ముదిరాయి...
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నేతలమధ్య విబేధాలు మరింతగా ముదిరాయి. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) శనివారం సాయంత్రం ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి సభ్యులందరూ తప్పని సరిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. దీంతో పంజాబ్ రాష్ట్ర కమిటీలో ని విబేధాలు మరోసారి భగ్గు మన్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హుటాహుటిని తనకు మద్దతు తెలిపే కాంగ్రెస్  ఎం.ఎల్.ఏలతో  సిఎల్.పి సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఎక్కుమ మంది శాసన సభ సభ్యుల మద్దతు ఉందనే విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కి తెలియజెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన మద్దతు దారులైన ఎం.ఎల్.ఏలను కూడబెట్టుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. స్వంత పార్టీ నేత, రాజకీయ వేత్తగామారిన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ తనపైన, తన ప్రభుత్వ విధానాలపైన  బాహాటంగా విమర్శలు చేస్తుండటమే ఇందుకు ప్రాధాన కారణం. ఇంత కాలం  తనపై జరుగుతున్న విమర్శల దాడిని అంతగా పట్టించుకోని అమరీందర్ ఇక పై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దపడ్డారని ఆయన మద్దతు దారులు తెలిపారు.
పంజాబాా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దూ నిర్దేశిత సమయానికన్నా ముందే చండీఘ ర్లోని పార్టీ  కార్యాలయానికి చేరుకున్నారు. పలువురు పార్టీ నేతలు సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్నారు. రాష్ట్రంలోని శాసన సభ్యులందరూ  పార్టీ సమావేశానికి హాజరవుతారని  కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జ్  హరీష్ రావత్ తెలిపారు. సి.ఎల్.పి సమావేశంసంగతి తనకు తెలియదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్,  హరీష్ చౌదరి చత్తీస్ ఘడ్ లోని తమ విడిదికి చేరుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో ని విబేధాలపై విలేఖరులు ప్రశ్నించగా వారు సమాధానం దాటవేశారు. అంతకు కొద్ది సేపటి ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి పూర్వ అధ్యక్షుడు సునీల్ ఝాకర్ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి పై ట్వట్టర్ వేదికగా స్పందించారు. పార్టీకి కాయకల్ప చికిత్స చెయ్యాలని సూచించారు. దీంతో  ప్రుభుత్వంలో ఉన్న వారికి, పార్టీ పదవుల్లో ఉన్న వారి మధ్యనున్న విబేధాలను మరింత తేటతెల్లం చేశాయి. అజెయ్ మాకెన్ మాత్రం "రాత్రి వరకూ వేచి చూడండి మీకే తెలుస్తుంది.  పార్టీలోప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు" అని ప్రకటించారు.  రాజకియ పరిశీలకులు మాత్రం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు పదవీ గండం తప్పదని భావిస్తున్నారు.  రాజకీయాలలో ఎవరి లెక్కలు వారికుంటాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: