ప్రశాంత్‌కు పోటీగా టీడీపీకి ఆయనే..!

M N Amaleswara rao
మళ్ళీ ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు హల్చల్ చేయడం మొదలైంది. ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తాజాగా సి‌ఎం జగన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే అర్ధమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి పీకే ఎంటర్ కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా క్యాబినెట్ సమావేశంలో సి‌ఎం జగన్...పీకే ప్రస్తావన తీసుకొచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది మార్చి నుంచి పీకే టీం రంగంలోకి దిగబోతుందని, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తుందని జగన్ హింట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పీకేని పెట్టుకునే జగన్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు పీకే...జగన్ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన టీం ఏ రకంగా జగన్ చేత రాజకీయం నడిపించిందో అందరికీ తెలిసిందే. వారి రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబు చిత్తు అయిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టి‌డి‌పి చిత్తుగా ఓడింది.
అయితే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న జగన్...తన సొంత వ్యూహాల కంటే మళ్ళీ పీకే టీం వ్యూహాలతోనే రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఎలాగైనా రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ పీకేని పెట్టుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే వైసీపీ కోసం పీకే రంగంలోకి దిగితే, టి‌డి‌పి తరుపున రాజకీయ వ్యూహాలు పన్నేది ఎవరని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీకి పీకే అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుని గెలుస్తామని టి‌డి‌పి నేతలు మాట్లాడుతున్నారు. తనపై నమ్మకం లేకే జగన్...పీకే టీంని రంగంలోకి దింపుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే టి‌డి‌పి కోసం రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల సమయంలో ఎవరి వ్యూహాలు పనిచేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: