విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌రిపేందుకు కేసీఆర్ నిజంగా భ‌య‌ప‌డుతున్నాడా..?

Paloji Vinay
రాజాకార్ల పాల‌న వ్య‌తిరేకించి ఎంద‌రో సాయుధ పోరాట వీరులు నేరొగొరిగిన నేల తెలంగాణ‌. నిజాంల పాల‌న‌లో బాంచ‌న్ అంటూ బ‌తుకుఈడ్చిన బ‌డుగు బ‌ల‌హీన జీవుల‌కు స్వేచ్ఛా వాయువులు అందిన రోజు సెప్టెంబ‌ర్ 17.. కానీ, ప్ర‌పంచంలో స్వేచ్ఛా దినోత్స‌వాన్ని జ‌రుపుకోని జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణ జాతి అని ప‌లువురు అంటున్నారు. ఎందుకంటే నిజాం ప‌రిపాల‌న నుంచి భార‌త యూనియ‌న్ లో కలిసిన చారిత్ర‌క‌ఘ‌ట్టాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా నిర్వ‌హించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.
   
     వాస్త‌వానికి తెలంగాణ స్వ‌రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు సెప్టెంబ‌ర్ 17 ను అధికారికంగా నిర్వ‌హించాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు కేసీఆర్‌. అలాగే తాము అధికారంలోకి వ‌స్తే తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని హామి ఇచ్చారు కూడా. కానీ అదే కేసీఆర్ స్వ‌రాష్ట్రం ఏర్ప‌డి ఏడు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా విమోచ‌న దినాన్ని అధికారంగా నిర్వ‌హించే విష‌యం గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని గ‌తంలో డిమాండ్ చేసిన కేసీఆర్ స్వ‌రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌ సెప్టెంబ‌ర్ 17 ను అధికారికంగా నిర్వ‌హిస్తే ఏంది లేక పోతే ఏంది అని అసెంబ్లీ సాక్షిగా స్వ‌యంగా కేసీఆర్ మాట్లాడిన తీరు ఇంకా తెలంగాణ స‌మాజం మ‌ర్చిపోలేదు.

    అస‌లు, తెలంగాణ విమోచ‌న దినాన్ని నిర్వ‌హించ‌డానికి కేసీఆర్ ఎందుకు వెనుక‌డుగు వేస్తున్నాడ‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్ర చ‌ర్చ‌నీంశంగా.. ఓ ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఈ క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు కేసీఆర్ నిజాం పాల‌కుల వార‌సుల‌కు, ఎంఐఎం కు భ‌య‌ప‌డి విమోచ‌న దినాన్ని నిర్వ‌హించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. అలాగే భార‌త దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన ఏడాదికి హైద‌రాబాద్ రాజ్యం నిజాం పాల‌న నుంచి స్వాతంత్య పొందిన ఆ క్ష‌ణాల‌ను ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని మేధావులు, నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: