వైసీపీ స‌ర్కార్ : అడిగితే అట్రాసిటీ కేసు?

RATNA KISHORE
ఆమె ఓ గిరిజ‌న ప్రాంతానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న నేత‌. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇప్పుడూ గెలిచి ప్ర‌జా దీవెన‌లు అందుకున్న మ‌గువ‌. మ‌న్యం ప్రాంతంలో అతి సాధార‌ణ జీవితం గ‌డుపుతున్న ప్ర‌జాప్ర‌తినిధి. ఇవ న్నీ నిన్న‌టి దాకా వినిపించిన మాట‌లు. కానీ ఇప్పుడు ఒక్క‌సారిగా శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించిన ఈ వార్త రాజ‌కీయం గానూ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రేపో మాపో విస్త‌ర‌ణ‌లో ఆమె విధేయ‌త‌ను ప‌రిగ‌ణించి మంత్రి ప‌దవి ద‌క్కుతుంద‌న్న ఆశ‌లూ ఉన్నాయి. అవి ఏమౌతాయి?

జ‌గ‌న్ ఇలాకాలో ఏమీ అడ‌గ‌వ‌ద్దు. ఏమీ ప్ర‌శ్నించ‌వ‌ద్దు. ఏద‌యినా అడిగినా, ప్ర‌శ్నించినా, నిల‌దీసినా త‌గాదాలు వ‌స్తుంటాయి. అవి ప‌రిష్కారం కావు క‌దా! కొత్త త‌ల‌నొప్పుల‌కు కార‌ణం అవుతాయి. ఇప్పుడిదే జ‌ర‌గ‌నుంది. తాజాగా శ్రీ‌కాకుళం ప్ర‌జాప్ర‌తినిధి ఒక‌రు భూ క‌బ్జా వివాదాల్లో ఇరుకున్నారు. స్థానిక టీడీపీ నాయ‌కులు తెలిసి కూడా మాట్లాడ‌డం లేదు. గ‌తంలో అయితే మాట్లాడేవారు కానీ ఇప్పుడున్న నిమ్మ‌క జ‌య‌రాజు మాట్లాడ‌డం లేదు. పోనీ ఇత‌ర నేత‌ల‌యినా మాట్లాడాలి కదా! పాల‌కొండ కేంద్రంగా జ‌రుగు తున్న ఓ భూ వివాదం సీపీఐ నారాయ‌ణ దృష్టిలో ప‌డింది. నిన్న‌టి వేళ శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న, స్థానిక నాయ కుల‌తో క‌లిసి మ‌న్యంలో ప‌ర్య‌టించారు.
 గిరిజ‌న ప్రాంతాల‌యిన బూర్జ మండ‌లం పాల‌వ‌ల‌స‌తో స‌హా ఇత‌ర ప్రాంతాల‌లోనూ తిరుగా డారు. ఈ సంద‌ర్భంగానే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపారు. ఎమ్మెల్యే వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం సృష్టించారు. దీంతో వార్త కాస్త ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైంది. ఎమ్మెల్యే చ‌దివాక ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స్థానిక సీ పీఐ నాయ‌కుల‌పై అట్రాసిటీ కేసులు పెడ‌తాన‌ని హెచ్చ‌రించార‌ని స‌మాచారం. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి వివాదాలకు సంబంధించి ఆమె పేరు ఎక్క‌డా విన‌ప‌డ‌లేదు క‌దా! ఇప్పుడే ఎందుకు అని ప్ర‌శ్నించిన విలేక‌రుల‌కు సీపీఐ నాయ‌కులు చెబుతున్న‌ది ఒక్క‌టే గ‌తం లోనూ ఉన్నాయి కానీ అవి వెలుగులోకి రాలేదు..ఇదొక్క‌టే స్థాయి మించి ఉండ‌డంతో జాతీయ నాయ‌కులు కూడా స్పందించారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: