శ్రీ‌కాకుళం వార్త : జ‌గన్ ఇలాకాలో ఎమ్మెల్యేకు ఫాం హౌస్ !

RATNA KISHORE
శ్రీ‌కాకుళం జిల్లాలో ఓ ఎమ్మెల్యే భూ క‌బ్జా త్వ‌ర‌లో రాష్ట్ర స్థాయిలో ప‌తాక స్థాయిలో వార్త కానుంది. ఇప్ప‌టికిప్పుడు టీడీపీ ప‌ట్టించు కోక‌పోయినా, రేప‌టి వేళ మాట్లాడాల్సిన నేతలు మాట్లాడాల్సిందే! పాల‌కొండ ఎమ్మెల్యే భూ క‌బ్జాపై సీపీఐ నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య క్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే ప‌రిణామంపై సీపీఐ జిల్లా నాయ‌కులు కూడా ఆందోళ‌న‌ల‌కు సిద్ధం అవుతున్నారు. ఈ నేప‌థ్యం లో ఈ త‌గాదా ఎందాక పోతుంద‌న్న‌దే ఇప్పుడిక కీల‌కం.

పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వస రాయ క‌ళావ‌తిపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆమె 30 ఎక‌రాలు క‌బ్జా చేసి ఫాం హౌస్ నిర్మించార‌ని సీపీ ఐ నారాయ‌ణ ఆరోపిస్తున్నారు. నిన్నటి వేళ శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా సీతంపేట మండ‌ల ప‌రిస‌రాల్లో ఆమె నిర్మి స్తున్న (లో - కొత్త వ‌ల‌స నారాయ‌ణ గూడ మ‌ధ్య‌లో) ఫాం హౌస్ ను సంద‌ర్శించి కొన్ని ఫొటోగ్రాఫ్స్ కూడా ఆయ‌న సంపాదించారు అని జిల్లా సీపీఐ నాయ‌కులు తెలిపారు. శ్రీ‌కాకుళం జిల్లా, బూర్జ మండ‌లంలో జ‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఆయ‌న ఎ న్నో ప్ర‌శ్న‌లు ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని సంధించారు. ఇదే స‌మయంలో ఎమ్మెల్యే తీరుపైనా, అధికారుల నిర్ల‌క్ష్యంపైనా ఫైర్ అ య్యారు.


ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌లో ఈ వార్త చ‌దివిన ఎమ్మెల్యే స్థానిక సీపీఐ నాయకుల‌పై సీరియ‌స్ అయ్యార‌ని జిల్లా సీపీఐ నాయ‌కులు హెరాల్డ్ మీడియాకు తెలిపారు. కాగా ఎమ్మెల్యే తండ్రి విశ్వ సరాయ వండ‌వ దొర గ‌తంలో కొత్తూరు ఎమ్మెల్యేగానూ, పార్వ‌తీపురం ఎంపీ గానూ ప‌నిచేశారు. సీనియ‌ర్ నాయ‌కులుగా కాంగ్రెస్ పార్టీలో సేవ‌లందించా రు. ఆయ‌న కుమార్తెగా క‌ళావ‌తి రెండు సార్లు ఎమ్మె ల్యేగా ఎన్నిక‌య్యారు. వైఎస్సార్సీపీకి ఈమె వీర విధేయురాలు. జ‌గ‌న్ జిల్లాలో చేప‌ట్టిన ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ పాల‌కొండ‌,పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో అటు క‌ళావ‌తి ఇటు రెడ్డి శాంతి స‌క్సెస్ చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రూ ఎమ్మెల్యేలే! పాలకొండ ఎమ్మెల్యేగా టీడీపీ హ‌యాంలో ఉన్న‌ప్పుడు విప‌క్ష స‌భ్యురాలి హోదాలో త‌రుచూ అప్ప‌టి మంత్రి అచ్చెన్న‌తో వాగ్వాదం ప‌డేవారు. త‌న మాట అధికారులు విన‌డం లేద‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయిన దాఖ‌లాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆశ్చ‌ర్యంతో పాటు అధికార పార్టీ స‌భ్యుల్లోనూ ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: