ఒక్కరోజులో రెండు కోట్లు.. భారత్ సరికొత్త రికార్డ్..!

NAGARJUNA NAKKA
కరోనా టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఒక్కరోజులోనే రెండు కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. సాయంత్రం 5గంటల 8నిమిషాల వరకు దేశవ్యాప్తంగా 2లక్షల 34వేల 207డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి ఒక్కరోజులో ఇన్ని టీకాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి.
ఇక దేశంలో కొత్తగా కొత్తగా 34వేల 403కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3కోట్ల 33లక్షల 81వేల 728కి చేరింది. కొత్తగా 320మంది కరోనా ధాటికి బలవ్వగా.. మరణాల సంఖ్య 4లక్షల 44వేల 248కు పెరిగింది. మరో 37వేల 950మంది కరోనా నుంచి కోలుకోగా .. మొత్తం రికవరీల సంఖ్య 3కోట్ల 25లక్షల 98వేల 424కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 39వేల 56యాక్టివ్ కేసులున్నాయి. అటు దేశంలో ఇప్పటి వరకు 77.24కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
మరోవైపు ఏపీలో గడిచిన 24గంటల్లో 60వేల 350కరోనా టెస్టులు చేస్తే.. 1,393 మందికి పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న 8మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 36వేల 179కు చేరగా ఇప్పటి వరకు 14వేల 52మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 1,296మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 797 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక కోవిడ్ సోకిన గర్భిణుల్లో ఇన్ ఫెక్షన్ ముప్పు అధికమని ఐసీఎమ్ఆర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఈ క్రమంలో వారికి సరైన వైద్య పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. మహారాష్ట్రలో 2020మార్చి నుంచి జనవరి 2021 జనవరి వరకు కరోనా సోకిన 4వేల 203మంది గర్భిణులపై సమగ్ర సర్వే చేపట్టింది. 77గర్భ స్రావాలు, 528మందికి ముందస్తు డెలివరీ, 328మందిలో రక్తపోటు సమస్యలు తలెత్తాయని అధ్యయనంలో తేలింది. కాబట్టి కరోనా సోకిన గర్భిణులు జాగ్రత్తగా ఉండాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: