కేసీఆర్...జేజమ్మ వచ్చినా నన్ను ఆపలేరు !

Veldandi Saikiran
తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి మాజీ మంత్రి ఈటల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేశామని... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం దుర్దినమని నిప్పులు చెరిగారు ఈటల.   

ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మరోసారి డిమాండ్ చేస్తున్నానని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జండా కాషాయ జెండాననే స్పష్టం చేశారు ఈటల రాజేందర్‌.   2023 లో భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని మనవి చేస్తున్నామని...  హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాల విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో మీరంతా గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.  ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఈ దేశ సార్వభౌమాధికారం, రాజ్యాంగానికి లోబడి పనిచేయని రోజు మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు వస్తుందని... హుజురాబాద్ గడ్డ మీద మీ అధికార అహంకారానికి ఘోరీ కట్టడం తద్యమని ఆయన తెలియ జేశారు.  

తెలంగాణ ప్రజలందరూ కూడా హుజురాబాద్లో ఏం జరగబోతుంది అని ఎదురు చూస్తున్నారని... ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా చూడాలని తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు ఈటల రాజేందర్‌.  అందరూ ఒకటే నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హుజూరాబాద్  ప్రజలకు సంఘీభావంగా అందరూ సిద్ధంగా ఉన్నారని... భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ 303 ఎంపీలు ఉన్న 18  రాష్ట్రాల్లో అధికారంతో పరిపాలిస్తున్న పార్టీ  హుజురాబాద్ లో జరుగుతున్నవి అన్నీ బిజెపి గమనిస్తోందన్నారు. హుజురాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు ఈటల రాజేందర్‌. దీనిని ఆపడం కెసిఆర్ కి కాదు కదా ఆయన..  జేజెమ్మకి కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: