వినాయక నిమజ్జనానికి ఎన్ని క్రేన్ లు...? ఎంత మంది పోలీసులు...?

Gullapally Rajesh
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు అధికారు. సుప్రీం కోర్ట్ అలాగే హైకోర్ట్ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కీలక అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి తలసాని, హైదరాబాద్ కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ లోకేష కుమార్, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు.
అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్న తలసాని.. తనకు ఉన్న అనుభవంతో పలు సూచనలు చేస్తున్నారు. 310 క్రేన్ లు మొత్తం గ్రేటర్ పరిధి లో ఏర్పాటు చేసారు. ట్యాంక్ బండ్ పై 40 ఏర్పాటు చేసామని అధికారులు వివరించారు. 310 కిలోమీటర్ల మేర శోభ యాత్ర జరుగనుంది అని ఆయన వివరించారు. ప్రతి 500 మీటర్ లకు శానిటేషన్ టీం అని ఆయన తెలిపారు. 8000 పైగా సిబ్బందిని వినియోగిస్తున్నామని కమీషనర్ లోకేష్  కుమార్ మీడియాకు వివరించారు. అన్ని ప్రాంతాల్లో అదనపు లైటింగ్ ఏర్పాటు చేసామని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.
మొత్తం 40 క్రేన్లు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశాము అని అయన పేర్కొన్నారు. ఎన్.టి.ఆర్. లో 14 క్రేన్లు, ట్యాంక్ బండ్ పై 16, పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్ లు ఏర్పాటు చేసామని అన్నారు. 32 గజ  ఈతగాళ్ళు సిద్దంగా ఉన్నారని వివరించారు. నిమజ్జన మైన గణనాథులను వేగంగా క్లీన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అని ఆయన పేర్కొన్నారు. నిమజ్జనం డ్యూటీ లో19000 మంది పోలీస్ డ్యూటీ లో ఉంటారు అని వివరించారు. ప్రతి క్రేన్ వద్ద ఒక్క పోలీస్ ఇంచార్జి ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుండి కూడా పోలీస్ లు వచ్చారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: