అనంత టీడీపీ గొడవ: జేసి ఇంట్లో మహిళా నేత పంచాయితీ...?

Gullapally Rajesh
అనంతపురం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం విషయంలో కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారాలు చంద్రబాబు నాయుడు ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు జేసి ప్రభాకర్ రెడ్డి. తాజాగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ని జూటూరులోని ఫాంహౌస్ లో సింగనమల నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రావణి శ్రీ, నియోజకవర్గ నేతలు... కార్యకర్తలు నేడు కలిసారు.
పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ద్విసభ్య కమిటీకి అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న బండారు శ్రావణి వర్గీయులు... నిన్న పార్టీకి రాజీనామా చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్న పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆమె కలిసిన తర్వాత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లే విబేధాలు ఉంటాయి అని అన్నారు ఆయన. విబేధాలు ఎంత ప్రమాదకరమైనవని ఆలోచించుకోవాలి అని సూచించారు. రెండు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉంటున్న...అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్నారు జేసి ప్రభాకర్ రెడ్డి.
నేను తెలుగుదేశం లోనే ఉన్నా అని అన్నారు. ఆయన ఆ మాటలు అనడం చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు. దురదృష్టం కాబట్టే 74 మున్సిపాలిటీ లో తెలుగుదేశం ఒక మున్సిపాలిటీ ఒకటి వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. అదృష్టం కాబట్టే అనంతపురం జిల్లాలో రెండు కౌన్సిలర్లు సీట్ కూడా రాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పెద్ద మనిషి కి చెప్పండి ఏది అదృష్టమో ఏది దూరదృష్టమో  అన్నారు జేసి. ఆయన ఏమి వ్యాఖ్యలు చేసాడో నాకు తెలియదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక జేసి వర్సెస్ అనంత టీడీపీ గా పరిస్థితి మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: