జ‌గ‌నోరి ముంద‌డుగు : ఉత్త‌రాంధ్ర ఊసులో ఎవ‌రెటు?

RATNA KISHORE
వ‌చ్చే ఎన్నిక‌లు ముంద‌స్తు ఎన్నిక‌లు అయితే ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు టీడీపీ, వైసీపీకి గ‌ట్టిపోటీనే ఇవ్వ‌నుంది. అలానే రాజ‌కీయ వార సుల‌కు ఇది కొత్త త‌ల‌నొప్పి కానుంది. దాస‌న్న కొడుకు రానున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం డి ప్యూటీ సీఎంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా శ్రీ‌కాకుళం లో సుదీర్ఘ కాలం రాజ‌కీయాలు చేసిన ధ‌ర్మాన ఈ సారి పోటీ చేయ‌ర‌ని తెలుస్తోంది. మ‌రోవైపు బొత్స కొడు కు సందీప్ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటారు. అంతేకాకుండా అయ్య‌న్న పాత్రుడు కొడుకు విజ‌య్, పెందుర్తి రాజ‌కీయ వేత్త బండారు స‌త్య‌నారాయ‌ణ కొడుకు అప్ప‌ల‌నాయుడు కూడా ఇలానే త‌మ జాత‌కాలు ప‌రీక్షించుకుంటారు. నేరుగా బ‌రిలో ఉంటారా లేదా తెర వెనుక రాజ‌కీయ శ‌క్తులుగా ఉంటారా అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.


వీరితో పాటు శ్రీ‌కాకుళం వ‌ర‌కూ గుండ కుటుంబం నుంచి ఓ వార‌సుడు రానున్నారు. విశ్వ‌నాథం (మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌, ల‌క్ష్మీదేవి దంప తుల చిన్న కుమారుడు, ఉన్న‌త విద్యావంతుడు) అడుగు వేయ‌నున్నారు. ఈ ద‌శ‌లో టీడీపీ మంచి మార్కులే కొట్టేయ‌నుంది. ఈ విధంగా చూసినా వైసీపీ నుంచి బొత్స కొడుకు సందీప్ ఇటుగా రానున్నార‌ని తేలిపోయింది. ఆయ‌న కూడా ఉన్న‌త విద్యావంతు డే. ఇప్ప‌టికే విజ‌య న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా మారారు. కానీ ఆయ‌న‌ను ప్ర‌జ‌లు అంగీకరిస్తారా లేదా అన్న‌దే వేచి చూడాలి.
ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ చేసిందేమీ లేద‌న్న వాద‌న‌ను టీడీపీ బ‌లంగా తీసుకుపోతోంది. ఇదే జ‌గ‌న్ కు మైన‌స్ కానుంది. జ‌గ‌న్ త‌ర‌ఫు న మాట్లాడే అవంతి  కానీ సాయి రెడ్డి కానీ అంత‌గా ప్ర‌భావ‌శీల‌కంగా ప‌నిచేయ‌డం లేదు. అదేవిధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థిం చే క్ర‌మంలో మంచి పేరు కూడా తెచ్చుకోలేక‌పోతున్నారు. ఇదే స‌మ‌యంలోవైసీపీ  చేస్తున్న త‌ప్పిదాల‌కు అనేక కార‌ణాలు క‌న‌ప డుతున్నాయి. సీనియ‌ర్ నాయ‌కులు ధ‌ర్మాన‌, బొత్స చొర‌వ అస్స‌లు లేదు. విజ‌య‌న‌గ‌రంలో తెలుగు యువ‌త చేస్తున్న కార్య‌క్ర మా ల‌కు మంచి స్పంద‌నే ఉంది. శ్రీ‌కాకుళంలోనూ ఎంపీ రామూ త‌న‌దైన పంథాను కొన‌సాగిస్తున్నారు. త‌న‌తో వ‌చ్చే శ‌క్తుల‌తోనే ప‌నిచే స్తూ పార్టీని నిల‌బెట్టే ప‌నిని భుజాన‌కెత్తుకున్నారు. ఇక్క‌డా సీనియ‌ర్ల స‌హ‌కారం ఆయ‌న‌కు లేక‌పోయినా యువ‌త‌లో ఆయ న‌కున్న క్రేజ్ జిల్లా రాజ‌కీయాల్లోనే  ఉత్త‌రాంధ్ర‌లోనే ఎవ్వ‌రికీ లేదు. అంతేకాదు ఏ రాజ‌కీయ వార‌సుడికీ లేదు. రాదు కూడా! మాజీ మంత్రి ధ‌ర్మాన వార‌సు డు చిన్ని కానీ, కృష్ణ‌దాసు వార‌సుడు కానీ ఆయ‌న‌ను దాటి ప‌నిచేయ‌లేక‌పోతున్నారు. ఇవ‌న్నీ రామూ కు అద న‌పు బ‌లాలు. రామూ ప్ర‌భావం ఏడు నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కూ ఉంటుంది. ఆయ‌న దృష్టి సారిస్తే వీటిలో ఐదు స్థానాలు ఖా యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: