రాడికలిజమే పెను సవాలు

రాడికలిజమే పెను సవాలు
సర్వమానవాళికి రాడికలిజమే పెను సవాలని  భారత ప్రధాన మం్రతి నరేద్ర మోడి వ్యాఖ్యానించారు. దీని కారణంగానే  ప్రతి చోట శాంతి భధ్రతలసమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన ఎస్.సి.ఓ  (షాంఘై కార్పో రేషన్ ఆర్కనైజేషన్ ) సదస్సులో ప్రసంగించారు.
వర్చవల్ గా జరిగిన ఈ సదస్సులో ప్రధాన మంత్రి కీలక అంశాలపై మాట్లాడారు.  తన ప్రసంగంలో ప్రధాని ఆరు నిమషాల పాటు   కీలకంగా ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావించారు.

 భారత్ వైఖరిని స్పష్టం చేశారు. శాంతి యత జీవన వాతావరణానికి భారత్ అధిక  ప్రధాన్యతనిస్తుందని పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఉగ్రవాదం మానవాళి మనుగడకు పెను ప్రమాదమని హెచ్చరించారు. ఎస్.సి.ఓ , సదస్సు సరైన సమయంలో జరుగుతున్నదని  ప్రధాన మంత్రి చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మరి తన ప్రతాపాన్ని చూపుతున్నవిషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమన్నారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు  అతలాకుతలం అయ్యాయని వేరే చెప్పక్కరలేదన్నారు. ప్రతి దేశం కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ఇతర దేశాలకు  సహాయ సహకారాలను అందిచాలని పిలుపునిచ్చారు.కరోవా వైరస్ విజృంభణ అరికట్టేందుకు అందరూ సమన్వయంతో పని చేసినప్పడే, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిద్ద్దుకోగలమని  చెప్పారు.
దక్షిణ ఆసియా దేశాలతో సంబంధ బాంధవ్యాలను మరింత పెంపొందించుకునేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు.  వ్యాపార లావాదేవీలు  ఇంకా ఇంకా  పెరగాల్సిన అవసంరం ఉందని నరేంద్ర మోడి అభిప్రాయ పడ్డారు. భారత్ లో విస్తారమైన వ్యాపార అవకాశాలున్నాయని  వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

నేటి యువతరంలో  ఎంతో మేథస్సు ఉన్నదని వాటిని, సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు. వారిని ప్రోత్సహించాని పిలుపునిచ్చారు. భారత దేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం క్రింద ఎన్నో కొత్త కొత్త పరిశ్రమలు, ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు  ఏర్పాటయ్యాని చేప్పారు.  ఇక్కడి వారి మేథస్సును  , ఆలోచనలను మిత్రదేశాలు పంచుకోవాలని అన్నారు.  పరస్పరం సహకరించుకుంటా సాంకేతికంగా, ఆర్థికంగా ముందుకు సాగుదామని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: