చంద్రబాబు కుట్రలు ఆపుతాం: ఏపీ మంత్రి

Sahithya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. రైతులకు సంబంధించి సాగు నీటి ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తుంది. తాజాగా విజయవాడలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ పరిపాలనా భవనం ప్రారంభించిన మంత్రులు అనిల్, వెల్లంపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి అనిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇరిగేషన్ శాఖలో అన్ని విభాగాలను ఒక‌ చోట ఏర్పాటు చేశాం అన్నారు ఆయన. రైతుల శ్రేయస్సు, సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తుంది అని స్పష్టం చేసారు.
జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలంతా హ్యాపీ గా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పాలన సాగిస్తున్నారు అని అన్నారు. కరోనా సమయంలో కూడా సిఎం చేసిన సాయం పేదలకు అండగా నిలిచింది అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు చాలా దుర్మార్గం గా కుట్రలు చేస్తున్నారు అని ఈ సందర్భంగా విమర్శలు చేసారు. ఎన్నికలు కూడా నిర్వహించకూడదని అడ్డుకున్నారు అని అన్నారు. కోర్టు తీర్పుతో రేపు 19న వచ్చే ఫలితాలు చంద్రబాబు కు గుణపాఠం  అని ఆయన పేర్కొన్నారు.
ఓటమి భయంతో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తారా అని నిలదీశారు. దేవుడి దయ, ప్రజల అండ  సిఎం జగన్ కు ఎప్పుడూ ఉంటాయి అని స్పష్టం చేసారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన కుట్రలు దేశంలో ఎవరూ‌చేసి ఉండరు అన్నారు. పంచాయతి, స్థానిక సంస్థల ఎన్నికలు లో టిడిపి కి బుద్ది చెప్పారు అని చెప్పుకొచ్చారు. అయినా అనుకూల మీడియా ద్వారా  అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని జడ్పీటీసీ, ఎంపిటీసీ ఫలితాలలో కూడా వైసిపిదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు ఇప్పుడు అయినా బుద్ది మార్చుకుని.. హుందా రాజకీయాలు చేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: