ప్రశాంత్ కిషోర్ కు వ్యూహం సిద్దం చేసిన టీడీపీ...?

Sahithya
ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విధంగా సిద్దం అయ్యారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీకి పరిస్థితి అనుకూలంగా ఉన్నా సరే ఏ పరిణామాలు ఉంటాయి అనేది అర్ధం కావడం లేదు. నిన్న నిర్వహించిన కేబినేట్ మీట్ లో ఆయన కొన్ని ఆదేశాలు ఇవ్వడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనం అయింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్చ్ బుద్దా వెంకన్న దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓటమి భయంతో ‎నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కేబినెట్ లో పీకే టీం గురించి, ఎన్నికల్లో పార్టీ గెలపోటముల గురించి చర్చించటం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో పీకే టీం ను రంగంలోకి దించేందుకు సిద్దమయ్యారు అని ఆయన ఆగ్రహంగా విమర్శలు చేసారు. పీకే కాదు.. పైనున్న జగన్ రెడ్డి తాత రాజారెడ్డి దిగొచ్చినా 2024లో వైసీపీ ఓటమిని టీడీపీ గెలుపును అడ్డుకోలేరు అంటూ బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేసారు.
టీడీపీకి పీకే అవసరం లేదు అని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో  పెట్టుకుంటే చాలు టీడీపీ అభ్యర్ధులు గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేసారు. పీకే అబద్దపు ప్రచారాల్ని గతంలో తిప్పికొట్టలేకపోయాం, ‎ ఈసారి ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నాం అని ఆయన అన్నారు. జగన్ అబద్దపు హామీలతో ఒక్క ఛాన్స్  అని చెప్పి.... అధికారంలోకి వచ్చి  రాష్ట్రాన్ని బీహార్ కంటే వెనకబడేలా చేశారు అని విమర్శించారు. నవరత్నాల అని నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి, రెండున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారు అని ఆగ్రహ విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: