స్వాతంత్య్ర అమృత్యోత్స వాలకు మస్తాబు

స్వాతంత్య్ర అమృత్యోత్స వాలకు మస్తాబు
భారత ప్రధాన మం్రతి నరేంద్రమోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ శ్రేణలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను దేశమంతటా నిర్వహిస్తున్నాయి. పలువులు మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రధాని  ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా అభివృద్ధి  ప్రాజెక్టు అతి త్వరలోనే పూర్తవుతుందని మంత్రులు ఈ సందర్భంగా ప్రకటించారు. ఒక విధంగా ఇది కేంద్ర ప్రభుత్వం  భారత ప్రజలకు ఇస్తున్న నరేంద్ర మోడీ జన్మదిన కానుక అని కూడా ప్రకటించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మం్రతి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు కీలక ప్రకటన చేశారు. 2022 న నిర్వహించే గణ తంత్ర దినోత్సవాలు గతం లో నిర్వహించే ప్రాంతంలో కాకుండా, కొత్త గా అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. పనులన్నీ త్వరిత గతిన జరుగుతున్నాయని, మరో రెండు మూడు నెలల్లో అవి పూర్తవుతాయని వివరించారు. స్వాతంత్య్ర అమృత్యత్స వాలకు మస్తాబు ఈ సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు సిద్దమవుతుందని తెలిపారు.
 ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఎంతో మంది కృషి ఉందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.  కస్తూర్భా గాంధీ మార్గా్, ఆఫ్రికన్ అవెన్యూలలో నూతనంగా నిర్మించిన  రెండు బహుళ అంతస్తుల భవనాలను ప్రారంభించారు. దాదాపు 7 వేల మంది రక్షణ సిబ్బంది  ఇకపై  ఈ భవనాల నుంచి పనిచేయనున్నారు. త్రిభుజా కారంలో నిర్మిచ నున్న ఈ నూతన భవన సదుపాయం మారుతున్న కాలానికి అనుగుణంగా రూపోందించారు.  ఇందులోనే నూతన పార్లమెంట్ భవనం, ప్రధాన మంత్రి , ఉపరాష్ట్రపతి నివాసం  సచివాలం తదితర భవవాలుంటాయి. పార్లమెంట్ 2022 పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ నూతన భవనంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కోవిడ్-19 తో వస్తున్న ఎదురుదెబ్బలు ఎలా ఉన్నా  ప్రభత్వం మాత్రం అనుకున్న సమయానికి సెంట్రల్ విస్టా అభివృద్ధి  ప్రాజెక్టును పూర్తి చేయాలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: