బిజెపి, కాంగ్రెస్ వ్యూహాలు కెసిఆర్ ను 'ఢీ' కొట్టగలవా..!

MOHAN BABU
 తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ తమ రూటును   మార్చుకున్నాయి. ఎలాగైనా తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. ఆ దిశలోనే  ఆయా పార్టీలన్నీ  ప్రజల్లోకి తమ యొక్క ఆలోచనలను వివిధ వ్యూహాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. సభలు సమావేశాలు రోడ్డు షోలతో తమ పార్టీ యొక్క ఉనికిని పెంచుకుంటున్నాయి.. అయితే ఈ పార్టీలన్నీ తెరాసను అధిగమించగలవా..? తెలంగాణలో ఏం జరుగుతోంది..? గత ఏడున్నర సంవత్సరాల నుంచి  రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి తెరాసకు  2021లో కాస్త ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. దీంతో తెరాస పార్టీ స్పీడ్ ను కూడా పెంచింది. ఒకవైపు ఇన్ని రోజుల నుంచి చతికిలపడి లేస్తున్న  కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి  టిపిసిసిగా ఎన్నికైన తర్వాత  ఆ పార్టీ తెలంగాణలో  రేవంత్రెడ్డి సారథ్యంలో  దూకుడు పెంచింది.

 ఇప్పటికే సభలు సమావేశాలతో విజయవంతంగా తమ యొక్క ఉనికిని చాటుకుంటోంది. ఈరోజు గజ్వేల్ లో కెసిఆర్ నియోజకవర్గంలో సభ పెట్టబోతోంది. ఇదంతా కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నారు. మరోవైపు బిజెపి బండి సంజయ్ సారథ్యంలో చాలా చురుకుగా ముందుకు పోతోంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంజయ్ రాష్ట్రంలో ఒక ఊపు ఊపుతున్నాడు  అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో  ఈరోజు నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు కసరత్తు చేశాయి. ఈ యొక్క సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు.

 అయితే ఈ సభకు దాదాపు రెండు లక్షల మంది రావడానికి బిజెపి కసరత్తు చేసింది. దీంతో తెలంగాణలో బిజెపి కూడా టీఆర్ఎస్ పై విల్లును ఎక్కు పెట్టింది. ఈ విధంగా ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి ఇలా దూకుడుతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు పోతున్నాయి. ఇదే సందర్భంలో  తెరాస ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా  దళిత బంధు, ఇతరాత్ర పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరే స్కీములతో ముందుకు పోతోంది. ఎంతో ముందస్తుగా ఆలోచించే అటువంటి కెసిఆర్ రాజకీయం ముందు ఈ పార్టీలు రాబోయే ఎన్నికల్లో నిలదొక్కుకుంటాయా.. లేక చతికిలపడతాయా  అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: