ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో 960 కోట్లు.. ఎలా వచ్చాయంటే?

praveen
చదువుకునే విద్యార్థుల ఖాతాల్లో ఎంత నగదు ఉంటుంది. మహా అయితే వేలల్లోనే డబ్బులు ఉంటాయి.. ఒకవేళ బాగా డబ్బున్న వాళ్ళు అయితే లక్షల్లో విద్యార్థులు ఖాతాల్లో డబ్బులు ఉండడం జరుగుతుంది  కానీ ఏకంగా చదువుకునే విద్యార్థుల ఖాతాల్లో కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయా..  అది కూడా 1,2 కోట్లు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయా..  విద్యార్థుల ఖాతాల్లో అంత డబ్బులు ఎందుకు ఉంటాయండి వాళ్ళు ఏమైనా ప్రపంచ కుబేరుల అని అంటారు ఇలా అడిగితే ఎవరైనా.

 అయితే ఇక్కడ మాత్రం ఏకంగా విద్యార్థుల ఖాతాలో 1కాదు 2 కాదు ఏకంగా తొమ్మిది వందల కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ విద్యార్ధులే అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊహించని అదృష్టం వరించింది అంటూ ఆ విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు. అదే సమయంలో డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అన్నది అర్థం కాక  కాస్త సందిగ్ధంలో కూడా పడిపోయారు  ఈ ఘటన పాట్నాలోని కటీహార్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు గురుచంద్ర విశ్వాస్, ఆసీస్ కుమార్ లకు బీహార్ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి.

 అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చదువుకునేందుకు వచ్చే ప్రోత్సాహక నగదు అందులో జమ అవుతూ ఉంటుంది. ఈ క్రమం లోనే ఇటీవలే ఇద్దరు విద్యార్థులు ఖాతాలు చెక్ చేసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విశ్వాస్  ఖాతాలో 60కోట్లు ఆశిష్ కుమార్ ఖాతాలో 900 కోట్లు జమ అయ్యాయి. ఇక ఇది చూసి ప్రేక్షకులు ఒకింత ఆనందం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఈ విషయం తెలిసి బ్రాంచ్ మేనేజర్ మనోజ్ గుప్తా సైతం అవాక్కయ్యాడు. వెంటనే ఇద్దరు ఖాతాలను నిలిపేసి..  ఉన్నతాధికారులకు సమాచారం అందించారు బ్యాంకు మేనేజర్. దీంతో అధికారులు ఈ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అనే దానిపై విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: