హ్యాపీ బ‌ర్త్ డే మోడీ : ఇట్లు మీ శ్రీ‌కాకుళం

RATNA KISHORE
గుజరాత్ త‌ర‌హా న‌మూనా అని చెప్ప‌డంలో చాలా మంది ఆసక్తి చూపారు. కాంగ్రెస్ కార‌ణంగా స్కాంల‌లో మునిగిపోయిన దేశాన్ని తాను చేయి ప‌ట్టుకుని మున్ముందుకు న‌డిపించి ఓ సుంద‌ర స్వ‌ప్న సాకారానికి కృషి చేస్తాన‌ని చెప్పారు. చెప్పిన మాట‌లు చెప్పిన విధంగానే ఉన్నాయి కానీ మా ఊరికి కానీ ఈ దేశానికి కానీ ఆయ‌న చేసిందేం లేదు. అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా పెద్దోళ్ల‌కు ల‌బ్ధి చేకూర్చి, పేదోళ్ల‌ను నిలువునా ముంచెత్తి ప‌నికిమాలిన చ‌ట్టాల‌ను తెర‌పైకి తీసుకుని రావ‌డంలో ముందుంటూ విప‌క్షాల అనైక్య‌త‌ను హాయిగా ఆస‌రాగా చేసుకుని బ‌త‌క‌డంలో బీజేపీ ముందుంది అన‌డంలో సందేహ‌మే లేదు.


న‌రేంద్ర మోడీ అనే ఓ సామాన్య బీజేపీ కార్య‌క‌ర్త ఈ దేశానికి ప్ర‌ధాని కావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు కానీ అసామాన్య ఫ‌లితాలు అయితే ఆయ‌న అందించ‌డం లేదు అన్న‌ది మాత్రం సుస్ప‌ష్టం. ముఖ్యంగా ఆర్థిక పురోగ‌తికి ఆయ‌న చేస్తున్న‌వేవీ లేక‌పోగా, ప్ర‌యివేటు కంపెనీల‌కు దాసోహం కావ‌డంలో ఆయ‌న ముందుటున్నార‌న్న‌ది వాస్త‌వం. కార్పొరేట్ కంపెనీల పురోగ‌తిపై కేంద్రం చాలా ప్రేమ చూపిస్తోంది కానీ అదే  సమ‌యంలో  వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతానికి ఏ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు.

అధికారం చేప‌ట్టాక, చేప‌ట్ట‌క మునుపు మోడీ ఎంద‌రికి చేరువ‌య్యారో కానీ, ఆ ప్ర‌తిభ, ఆ మాట చాతుర్యం మ‌రొక‌రికి రావు అన్న‌ది వాస్త‌వం. ముఖ్యంగా పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల ప‌రంగా దేశంలో ఎన్న‌డూ లేనంత అంధ‌కారం ఉంది. పారిశ్రామిక రంగంలోనూ, బ్యా కింగ్ రంగంలోనూ ఈ అంధ‌కారం కార‌ణంగా అన్ని రంగాలు మ‌రింత చీక‌ట్ల‌లో కూరుకుపోతున్నాయి. రాష్ట్రాల‌కు ఊతం ఇచ్చే ని ర్ణ‌యాల‌లో ఒక్క‌టంటే ఒక్క‌టి మోడీ తీసుకోవ‌డం లేదు. ఉత్త‌రాది రాష్ట్రాల‌కు జ‌నాభా ప్రాతిప‌దికన నిధులు ఇస్తూ, త‌ద్వారా ఆయా ప్రాంతాల‌లో బ‌ల‌ప‌డేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ బాగున్నాయి. కానీ అదే స‌మ‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ఆదుకున్న వైనం ఏదీ క‌న‌బ‌డ‌దు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

pm

సంబంధిత వార్తలు: