టీడీపీ త్రిమూర్తులుతో వైసీపీకి ద‌బిడి దిబిడే....!

VUYYURU SUBHASH
గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ.. జ‌గ‌న్ హ‌వాను కూడా త‌ట్టుకుని నిలిచి.. గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు ఇప్పుడు వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందా?  వైసీపీ ప‌రిస్థితిఅస‌లు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితిలో ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతే కాదు.. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు నేత‌ల దూకుడు ఓ రేంజ్‌లో ఉంద‌ని కూడా చెబుతున్నారు. వారే.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు .. అద్దంకి గొట్టిపాటి ర‌వికుమార్‌, కొండ‌పి.. డోలా బాల వీరాంజ‌నేయ స్వామి, ప‌రుచూరు ఏలూరి సాంబ‌శివ‌రావు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు దూకుడు గా ఉంటూనే.. జిల్లాకు జ‌రుగుతున్న అన్యాయంపై ఏక‌తాటిపైకి వ‌చ్చి.. ప్ర‌శ్నిస్తున్నారు.,

ఇటీవ‌ల వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ చేసిన వాద‌న‌ను ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు ఒక్క‌రంటే.. ఒక్క‌రు కూడా స్పందించేలేదు.. ఖండించ‌లేదు. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. సీఎం కేసీఆర్‌కు లేఖ సంధించారు. వెలిగొండ ప్రాజెక్టు.. ప్ర‌కాశం జిల్లాకు జీవమ‌ని.. ప్రాణాధార‌మ‌ని..ఇ క్క‌డి రైతులు.. వెలిగొండ‌పై అనేక ఆశ‌లు పెట్టుకున్నార‌ని.. కేంద్రం ప్ర‌చురించి గెజిట్‌లో దీనికి చోటు లేక‌పోవ‌డం.. సీఎం జ‌గ‌న్ చేసిన పొర‌పాటే త‌ప్ప‌.. ఇక్క‌డి ప్ర‌జ‌లకు సంబంధం లేద‌ని వారు పేర్కొన్నారు.


అంతేకాదు.. వెలిగొండ ప్రాజెక్టు అక్ర‌మ‌మ‌ని చెప్పే హ‌క్కు కేసీఆర్ కు లేద‌ని.. అలా అయితే.. మీ రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులు కూడా అక్ర‌మ ప్రాజెక్టుల కింద‌కే వ‌స్తాయ‌ని వారు పేర్కొన్నారు. వెలిగొండ విష‌యంలో కేంద్రానికి తెలంగాణ రాసిన లేఖ‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకుని.. ప్ర‌కాశం జిల్లా ప్ర‌జ‌లు, రైతుల నీటి హ‌క్కుల‌ను కాపాడాల‌ని వారు విన్న‌వించారు. ఈ ప‌రిణామం.. నిజంగా.. రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌కాశం జిల్లాకు చ‌చెందిన  అధికార పార్టీ నేత‌లు.. మౌనంగా ఉంటే.. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏక‌తాటిపైకి వ‌చ్చి.. కేసీఆర్‌కు లేఖ సంధించ‌డం.. బాగుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

ఇక‌, ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రికి.. గొట్టిపాటి ర‌వి, ఏలూరి సాంబ‌శివ‌రావుల‌కు.. అధికార పార్టీ నుంచి తీవ్ర‌మైన ఒత్తిళ్లు వ‌చ్చాయి. త‌మ పార్టీలో చేరాల‌ని.. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ.. వారు చ‌లించ‌క‌పోగా.. కేసుల‌కు వెరిచేది లేద‌న్నారు.ఇక‌, డోలా పై కూడా.. కేసులు పెట్టేందుకు రెడీ అయినా.. ఎక్క‌డా ఆయ‌న కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. ప్ర‌బుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఇలా ముగ్గురు చూపిస్తున్న దూకుడుతో.. ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ గ్రాఫ్ ఆకాశాన‌నికి చేరింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి మంచి రిజ‌ల్ట్ మ‌ళ్లీ ఖాయ‌మ‌ని చుఎబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: