రేవంత్‌కు బండి బ్రేకులు వేస్తారా..?

Paloji Vinay
 తెలంగాణ రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్నాయి. మొన్న‌టి దాకా టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ గా ఉండేది. అయితే, టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి నియామ‌కంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పోటీలోకి వ‌చ్చింది. రేవంత్ రాకతో హ‌స్తం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డానికి రేవంత్ వ్యూహాల‌ను ర‌చిస్తున్నాడు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామెనంటు ఈ విష‌యంలో బీజేపీ త‌మ‌కు స‌రితూగ‌దంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు.


   అలాగే, బీజేపీ లో కొన‌సాగుతున్న వారిని, కాంగ్రెస్ వైపు చూస్తున్న నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి రేవంత్ కృషి చేస్తున్నాడు. గ‌తంలో బీజేపీలో రావ‌డానికి సిద్ద‌మ‌యిన కొంద‌రు నేత‌లు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌ను నియ‌మించే స‌రికి ఆ నేత‌ల‌తో పాటు బీజేపీలోని కొంద‌రు కాంగ్రెస్ వైపు చూడడం కాషాయ‌ద‌ళానికి త‌లనొప్పిగా మారింది. త‌మ వైపు రావాల‌నుకున్న నేత‌ల‌ను కాంగ్రెస్ వైపు వెళ్ల‌కుండా అడ్డ‌కోవ‌డంలో బీజేపీ కాస్త స‌క్సెస్ అయింద‌ని చెప్పుకోవాలి. దేవందర్ గౌడ్ త‌న‌యుడు వీరేంద‌ర్ గౌడ్‌, కూన శ్రీ శైలం గౌడ్‌, కూన విక్ర‌మ్ గౌడ్ వంటి నాయ‌కులు రేవంత్ నాయ‌కత్వంలోని కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.


 బీజేపీలో ఉన్న వీళ్లు కాంగ్రెస్‌లో చేర‌కుండా చేరితే క‌ష్టం అని భావించిన కాషాయద‌ళం వారు పార్టి మార‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.
  దీంతో రేవంత్‌కు కాస్త అడ్డు ద‌గిలిన‌ట్టు క‌నిపిస్తోంది. అలాగే ఇప్పుడు  రాష్ట్ర‌  బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జాసంగ్రామ యాత్ర పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. దీంతో ఈ పాద‌యాత్ర‌లో భాగంగా వంద‌ల మంది బీజేపీలో చేరుతున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను బండి పాద‌యాత్ర వ‌ల్ల అడ్డం త‌గులుతుంద‌ని, త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు బీజేపీలో చేర‌డం వ‌ల్ల  రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.  అలాగే కాంగ్రెస్ , బీజేపీల‌కు తామె ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకొస్తున్నా బండి సంజ‌య్‌.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: