కెసిఆర్ పథకం.. బీజేపీకి బలం?

praveen
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ మరింత వాడి వేడి గా మారిపోతున్నాయి అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే అన్ని పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని పాదయాత్రలు చేసినా  అందరి టార్గెట్ ఒక్కటే హుజురాబాద్ ఉప ఎన్నిక.  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయ్ అని చెప్పాలి. ఎవరికి వారు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.  అయితే హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. కానీ అప్పుడే ఎన్నికల వేడి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో రాజుకుంది.

 అయితే అటు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రతిపక్ష బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంది అన్నది అర్ధమవుతుంది.  ఈ క్రమంలోనే అటు కె.సి.ఆర్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కెసిఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ కీలక నేతలందరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  అదే సమయంలో అధికారంలో చేతిలో ఉండటంతో వెనకా ముందు ఆలోచించకుండా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ఆకర్షించేందుకు భారీగా నిధులు కేటాయించడం.. కనీవినీ ఎరుగని రీతిలో పథకాల ద్వారా లక్షల రూపాయలు పంచటం లాంటివి చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ.

 ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న వారు బీజేపీ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.  మరోవైపు ఇటీవల కేసీఆర్ తీసుకు వచ్చిన సంచలన పథకం కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారిపోయింది.  కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చింది.  దళితులకు 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది.  ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా దళితులకు 10 లక్షలు ఇస్తే.. మరి మా మాటేంటి బీసీలు కెసిఆర్ పై వ్యతిరేకత పెంచుకుంటారు.  మాకు కూడా బిసి బంధు ప్రకటించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.  ఇక మరోవైపు ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే దళిత బంధు వచ్చింది. దీంతో మిగతావారు మేము దళితులం కదా మాకు ఎందుకు ఇవ్వరు అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఇలా దళిత బంధు ద్వారా టిఆర్ఎస్ ఫై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత బీజేపీకి బాగా ప్లస్ పాయింట్ గా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: