ముందస్తు వ్యూహంతో జగన్.. ఏం జరగబోతోంది..?

MOHAN BABU
ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు. 2022  నుంచి పీకే టీం సీన్లోకి రానున్నది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారా..? ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచనల వెనుక ఆంతర్యం ఏంటి..? 2022 లోనే పీకే టీమ్ రంగంలోకి దించడం ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేనని..? వైసీపీ పై వ్యతిరేకత పెరగక ముందే ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో జగన్ ఉన్నారా..? రెండున్నరేళ్ల పాలన పూర్తి కాకుండా ఎన్నికలపై అలర్ట్ గా ఉండాలంటూ కేబినెట్ భేటీలో సూచించడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.అసలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? లేక టార్గెట్ 2024 లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించడంలో భాగమేనా..

 అన్న దానిపై ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు ఇప్పటికీ జగన్ ప్రమాణస్వీకారం చేసిన స్పీచ్ ఇంకా వారి చెవుల్లో మర్మోగుతూనే  ఉంది. ఇంకా రెండున్నరఏళ్లు కూడా జగన్ పాలన పూర్తికాలేదు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అప్పుడే టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రం ఆర్థిక లోటు తో కొట్టుమిట్టాడుతోంది. దానికి తోడు కరోనా వైరస్ విపత్కర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వెనక్కి నెట్టింది. అయినప్పటికీ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు.. మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను సైతం అమలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన  కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. పింఛన్లు,రేషన్ కార్డుల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను, మంత్రులు,ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పెన్షనర్ల జాబితాపై ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాలని సూచించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని సీఎం అన్నారు. 2024 లో జరగబోయే ఎన్నికల కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహ  కర్తగా వ్యవహరిస్తారని సీఎం జగన్ మంత్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

 పీకే బృందం 2022 కల్లా రాష్ట్రానికి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే బృందం ఇచ్చే సూచనలను ప్రతి ఒక్క ఎమ్మెల్యే పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలను కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. అంతేకాదు రెండేళ్ల సీఎం జగన్ పాలన పై ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 శాతానికి పైగా అమలు చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: