ఇక సంసద్‌ టీవీ ప్రసారాలు...!

Podili Ravindranath
పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా చూడాలంటే గతంలో దూరదర్శన్ మాత్రమే దిక్కు. వాళ్లు ప్రసారం చేసినప్పుడు మాత్రమే అసలు సభలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఆ తర్వాత శాటిలైట్ ఛానళ్ల పర్వం మొదలైన తర్వాత... సభలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియటం మొదలైంది. ప్రైవేటు ఛానళ్ల స్థానంలో ప్రభుత్వమే ఆ ప్రసారాలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం పార్లమెంట్ ఉభయ సభలకు రెండు వేరు వేరు టీవీ ఛానళ్లను ఏర్పాటు చేశారు. లోక్ సభ ప్రసారాలు, కార్యక్రమాల కోసం లోక్‌సభ  ఎల్ఎస్‌ టీవీ, రాజ్యసభ ప్రసారాలు, కార్యకలాపాలు, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం రాజ్యసభ ఆర్‌ఎస్‌ టీవీని నడిపిస్తున్నాయి.
ఇలా రెండు ఛానళ్లు ఉండటం వల్ల ఆర్థికంగా భారంతో పాటు ప్రసారాల్లో క్లారిటీ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెండు ఛానళ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో సంసద్ టీవీ పేరుతో ఒకటే ఛానల్ తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక డిజిటల్ ఎక్యూప్‌మెంట్‌తో ఉన్నతస్థాయి సాంకేతిక విలువలతో కొత్తగా ఏర్పాటు చేసన సంసద్‌ టీవీ ఛానల్‌ ప్రసారాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. సంసద్‌ టీవీ ప్రసారాలను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా ప్రకటించింది. అంతర్జాతీయ ప్రజాస్వామిక దినోత్సవం రోజున ఈ ఛానల్‌ను ప్రారంభం కాబోతోందని పీఎంవో స్పష్టం చేసింది. పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేసేందుకు సంసద్‌ టీవీని  కొత్తగా ఏర్పాటు చేసినట్లు పీఎంవో తెలిపింది. సంసద్‌ టీవీ కార్యక్రమాలు నాలుగు కేటగిరీలుగా ప్రసారం కానున్నాయి. పార్లమెంట్‌, ప్రజాస్వామిక సంస్థల కార్యకలాపాలు, పరిపాలన, పథకాలు, విధానాల అమలు, భారతీయ చరిత్ర సంస్కృతి, సమకాలీన అంశాలు తదితర అంశాలపై ప్రసారాలు ఉంటాయని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: