వైసీపీని గెలిపిస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే...ఫిక్స్ అయినట్లేనా...

M N Amaleswara rao
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం...ఎలాంటి డౌట్ లేకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ వేరే పార్టీకి పెద్దగా గెలిచిన సందర్భాలు లేవు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే..ఇచ్చాపురంలో 8 సార్లు టి‌డి‌పి జెండా ఎగిరింది. అంటే ఇచ్చాపురం ప్రజలు టి‌డి‌పిని ఏ విధంగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి తరుపున బెందాళం అశోక్ గెలుస్తూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో అంతటి జగన్ వేవ్‌లో కూడా అశోక్..ఇచ్చాపురంలో గెలిచారు. అయితే ఇలా జగన్‌ని కాదని ఇచ్చాపురం ప్రజలు అశోక్‌ని గెలిపించారు. మరి అలా గెలిపించిన ప్రజలకు తగ్గట్టుగా అశోక్ పనిచేస్తున్నారా? అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉండటంతో నియోజకవర్గంలో పెద్దగా పనులు చేయించలేకపోతున్నారు. అలాగే ఈయన ఎక్కువగా వైజాగ్‌లోనే ఉంటూ, ఇచ్చాపురం ప్రజలకు తక్కువగా అందుబాటులో ఉంటున్నారు. అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మమ అనిపిస్తున్నారు.
దీంతో ఇచ్చాపురంలో అశోక్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా ఇక్కడ అశోక్‌పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తేలింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచిన స్థానాల్లో టి‌డి‌పి నేతలు పికప్ అవ్వాలని చూస్తుంటే, అశోక్ మాత్రం గెలిచిన స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. అయితే వైసీపీ తరుపున సాయిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నారు.


నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న సాయిరాజ్...ప్రజలకు అండగా ఉంటున్నారు. అధికార పార్టీలో ఉండటంతో కావల్సిన పనులు చేసి పెడుతున్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసుకుంటున్నారు. గతంలో సాయిరాజ్‌కు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. 2009లో సాయిరాజ్, ఇచ్చాపురం నుంచే టి‌డి‌పి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అనుభవం ఉండటంతో నియోజకవర్గంపై మరింత పట్టు పెంచుకున్నారు. అటు అశోక్‌పై వ్యతిరేకత పెరగడం సాయిరాజ్‌కు బాగా కలిసొచ్చేలా ఉంది. ఇక  దీని బట్టి చూసుకుంటే ఇచ్చాపురంలో అశోక్....సాయిరాజ్‌ని గెలిపించేలా కనిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: