మాఫియా డాన్ అనుకొని అరెస్ట్ చేశారు..! చివరకు..!

NAGARJUNA NAKKA
నెదర్లాండ్స్ పోలీసులు పొరపాటు పడ్డారు. ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే ఖాకీలు.. అమాయకుడికి సంకెళ్లు వేశారు. లివర్ పూర్ కు చెందిన ఫార్ములా వన్ అభిమానిని చూసి పొరపాటు పడ్డారు. ఎన్నాళ్లుగానో వెతుకుతున్న ఒక మాఫియా డాన్ గా అతడు కనిపించాడు. ఇంకేముందీ అతగాడిని పట్టుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని భావించారు. దాంతో తమకు ప్రమోషన్ వస్తుందని.. అవార్డులు.. రివార్డులు కూడా వస్తాయని భావించారు.

మార్క్ ఎల్ అనే వ్యక్తి కనబడగానే మాఫియా డాన్ అనుకొని ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టారు. అతడికి ఏమవుతుందో అర్థం కాలేదు. వెంటనే గన్ గురి పెట్టి లొంగిపోవాల్సిందిగా చెప్పారు. మార్క్ ఎల్ నుంచి వివరాలు సేకరించకుండానే బలవంతంగా వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. మార్క్ ఎల్ ఏదో కరుగుడు గట్టిన నేరస్థుడు అన్నట్టుగా కళ్లకు గంతలు కట్టి మరీ తీసుకెళ్లారు. బాధితుడి వయసు 54 సంవత్సరాలు ఉంటుంది. మార్క్ ఎల్ ఆ సమయంలో రెస్టారెంట్ లో తన కుమారుడితో కలిసి తింటూ ఉన్నాడు.  
నిజానికి పోలీసులు పట్టుకోవాల్సింది ఇటలీకి చెందిన అంతర్జాతీయ మాఫియా డాన్  మాటియో మెస్సినా దేనారోని. ఇతడు కరుడుగట్టిన నేరస్థుడు. 1993లో బాంబా దాడులు జరిపాడు. ఈ దాడుల్లో 10మంది అమాయకులు చనిపోయారు. దాదాపు 93మంది గాయపడ్డారు. దీనికంతటికీ సూత్రధారి మాటియో మెస్సినా అని గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వెతుకుతున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. అలాంటి వ్యక్తే కనిపించడంతో పోలీసులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. వెంటనే సంకెళ్లకు పనిచెప్పారు.
మార్క ఎల్ ను కోర్టులో హాజరుపరచడంతో అసలు విషయం బయటపడింది. అతడు మాఫియా డాన్ కాదని తేలిపోయింది. అతడు ఇంగ్లీష్ పౌరుడనీ.. బాంబు దాడులతో సంబంధం లేదని తెలిసింది. వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.  దీంతో నాలుక కరచుకున్న పోలీసులు మార్క్ ఎల్ ను విడుదల చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: