వ‌యా గుంటూరు : ఏపీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం ?

RATNA KISHORE
మ‌హాన‌గరాల‌ను ప‌ట్టి పీడిస్తున్న డ్ర‌గ్ రాకెట్ మారుమూల ప్రాంతాల‌ను సైతం విస్త‌రించ‌డంలోనే ఆస‌క్తి ఉంది. చ‌దువుతూ త‌మ ఉ న్న‌తికి మార్గాలు వెతుక్కోవాల్సిన కుర్రాళ్ల‌కు డ్ర‌గ్స్ తో ఏం ప‌ని అని అడ‌గ‌వ‌ద్దు..? ఎందుకంటే అదంతే మేం మోడ్ర‌న్..మా..అలవా ట్లూ మోడ్ర‌న్ అని చెప్పే ద‌రిద్ర‌గొట్టు స‌మాజంలో ఉన్నంత కాలం ఎవ్వ‌రినీ ఎవ్వ‌రూ నిందించ‌లేరు..నిల‌దీయ‌లేరు. గుంటూరు పోలీ సుల‌కు ఇదొక స‌వాలు. గోవా మీదుగా చేరుకున్న డ్ర‌గ్స్ కేసు ఎంత వేగంగా ఛేదిస్తే అంత మేలు అన్న‌ది చాలా మంది మాట.

ఆధునిక స‌మాజంలో ఏమ‌యినా ఎక్క‌డ‌యినా లభిస్తాయి లేదా ఇటుగా ఆన్ లైన్ బుకింగ్ లో చురుగ్గా  చేరుకుని నిమిషాల్లో అ వ‌స‌రాల‌ను తీరుస్తాయి. ఇదే కొంద‌రికి వ‌ర‌దాయినిగా మారింది. కొన్ని చీక‌టి ముఠాల‌కు ఆశా కిర‌ణమైంది. తాజాగా అస్స‌లు ఎ వ్వరూ ఊహించ‌ని రీతిలో ఆంధ్రావ‌నిలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టిదాకా మ‌హాన‌గ‌రాల‌కే ప‌రిమితం అయిన డ్ర‌గ్స్ ర‌వాణా, విని యోగం అన్న‌వి గుంటూరు లాంటి ప్రాంతాల‌కు  చేరిపోయింది. దీంతో ఈ సంఘ‌ట‌న సంచ‌ల‌నం రేపుతోంది. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హ ఫీజ్ తెలిపిన వివ‌రాలన్నీ విస్తుబోయేలా ఉన్నాయి. ఘ‌ట‌న‌కు బాధ్యులుగా భావిస్తున్న వారంతా ఇంజినీరింగ్ విద్యార్థులే కావ‌డం త‌ల్లి దండ్రులను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసే విష‌యం.
గుంటూరు అర్బ‌న్ ప‌రిధిలో మంగ‌ళవారం సాయంత్రం పెద్ద‌కాకాని పెట్రోలు బంకు స‌మీపాన కొంద‌రు విద్యార్థుల నుంచి డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవ‌న్నీ ఆన్ లైన్ ద్వారా వ‌చ్చాయని గుర్తించారు. వీటి విలువ ల‌క్ష రూపాయ‌లు ఉంటుంద ని అర్బ‌న్ ఎస్పీ చెబుతున్నారు. సింధటిక్ డ్ర‌గ్స్ గా వీటిని పేర్కొంటామ‌ని, ఇంత‌వ‌ర‌కూ గుంటూరులో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచే సుకోలేద‌ని నిఘా వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇవ‌న్నీ ఆన్లైన్ ద్వారానే గోవా మీదుగా ఇక్క‌డికి చేరుకున్నాయ‌ని గుర్తించారు. ఘ ట‌న‌లో ముగ్గురు ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌ను అరెస్టు చేశామ‌ని ఎస్పీ తెలిపారు. వీటిపై పూర్తి ద‌ర్యాప్తు జ‌రిగాకే అస‌లు విష‌యం ఏంట‌న్న‌ది తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: