జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్ డీజిల్‌?

Dabbeda Mohan Babu
ఈ మ‌ధ్య కాలంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇలా ధ‌ర‌లు పెర‌గ‌డం పై కేంద్ర ప్ర‌భుత్వం పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. పెరుగుతున్న ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా అన్ని రాష్ట్రాల‌ల్లో ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ఆందోళ‌న‌లు చెప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీ లో లీట‌ర్ పెట్రోల్ కు రూ.101.19 ధ‌ర ఉంది. అలాగే డీజిల్ కు లీట‌ర్ పై రూ. 88.62 వ‌ర‌కు ఉంది. గ‌తంలో లీట‌ర్ పెట్రోల్ కు దాదాపు రూ. 110 వ‌ర‌కు వెళ్లింది. దీంతో సామ‌న్యూలు పెట్రోల్ వాడ‌కానికి పూర్తిగా దూర‌మైయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ పెరిగింది. ఆ ధ‌ర‌లను కూడా నియంత్రించాల‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేశారు.

కాగ లోక్ స‌భ‌లో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా పెరుగుద‌ల పై స్పందించింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో పెట్రోల్ ధ‌ర‌ల‌ను దాదాపు 39 సార్లు పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే డీజిల్ ధ‌ర‌ల‌ను కూడా 36 సార్లు పెంచిన‌ట్టు వివ‌రించారు. ఈ మ‌ధ్య లో పెట్రోల్, డిజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించినా సామ‌న్యూడు అందుకునే స్థాయిలో లేవ‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నారు. కాగ పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్, డీజిల్ ల‌ను తీసుకురావల‌నే డిమాండ్ పెరుగుతుంది. వీటిని జీఎస్‌టీ ప‌రిధిలోకి తెచ్చి ఒక స్లాబ్ ను కేటాయించి దేశ వ్యాప్తంగా ఒకే రేటులో, త‌క్కువ ధ‌ర‌కు అమ్మేలా చూడాల‌ని ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు కేంద్రానికి సూచిస్తున్నారు.

ఈ నెల 17న జీఎస్‌టీ స‌మావేశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌బోతుంది. ఈ స‌మావేశంలో నైనా పెట్రోల్‌, డీజిల్ ల‌ను జీఎస్‌టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని అంటున్నారు. కాగ ఈ జీఎస్‌టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌తినిధులు ఉంటారు. ఈ జీఎస్‌టీ కౌన్సిల్ లో ఎదైనా మార్పు చేయాలంటే ప్యానెల్‌లోని 3\4 వంతు ప్ర‌తినిధులు ఆమోదం తెలపాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే ఈ పెట్రోల్‌, డీజిల్ ల వ‌ల్ల కేంద్ర రాష్ట్రాల‌కు ప్ర‌ధాన వ‌న‌రుగా ఉంది. గ‌తంలో ఈ ప్ర‌తిపాధ‌న వ‌చ్చినా తామ రాష్ట్రం న‌ష్ట‌పోతుంద‌ని దాదాపు అన్ని రాష్ట్రాల ప్ర‌తినిధులు ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. మ‌ళ్లి ఈ స‌మావేశంలో మ‌రోసారి ఈ ప్ర‌తిపాధ‌న వ‌స్తుంది. దీని పై ఎయే రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తాయో.. ఎవి స‌పోర్ట్ చేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: