మూడు దశాబ్దాలలో .. ఆ దేశాలు ఖాళీ ..

Chandrasekhar Reddy
మానవుడు తన అత్యాశతో, అభివృద్ధి పేరుతో విపరీతంగా పారిశ్రామికీరణ ప్రోత్సహిస్తూ పోతున్నాడు. దీనిద్వారా మానవునికి ప్రకృతి ప్రసాదించిన అనేక సహజ వనరులు కాలుష్య బారిన పడిపోతున్నాయి. ఇవి చాలా వరకు నిరుపయోగం అయిపోయాయి. దీనితో రానురాను చాలా ప్రాంతాలలో వాయు, జల కాలుష్యాలు తీవ్రం అయిపోయాయి. ఆయా ప్రాంతాలలో మనిషి జీవనం చాలా కష్టంగా మారింది. ఇది ఇలాగె కొనసాగితే ఇలాంటి చాలా ప్రాంతాలలో మనిషి నివసించలేక భారీగా వలసలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తాజాగా చేసిన ఒక సర్వే లో పేర్కొంది. అయితే ఈ ప్రభావం మరో మూడు దశాబ్దాలలో తీవ్రతరం అయ్యి, చాలా ప్రాంతాలు ఖాళీ చేయబడతాయని పేర్కొంది.
ఇటువంటి భారీ వాతావరణ మార్పులతో 2050 నాటికి 200 మిలియన్ల మంది సొంత నివాసాలను వదులుకోవాల్సి వస్తుందని ఈ సర్వే లో వెల్లడైంది. మానవుడు అభివృద్ధి పేరు చెప్పి ఇష్టానికి పరిశ్రమలు స్థాపించి, వాటినుండి వస్తున్న కాలుష్యాన్ని శుద్ధి కూడా చేయకుండా వాతారణంలోకి వదలటమే ఈ వలసలకు ప్రధాన కారణంగా ఉండనుంది. ఈ పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం తో తీవ్రమైన వాతావరణ మార్పులు, నీటి కొరత, సముద్రమట్టాలు పెరగటం, పంటలు ఉత్పత్తి చాలా తక్కువ అయిపోవటం మానవ వలసలకు దారితీస్తుంది. ఇటువంటి స్థితికి ప్రధానంగా ఆరు దేశాలు కారణంగా పేర్కొన్నారు. లాటిన్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, సహారా ఆఫ్రికా, తూర్పు యూరప్, పసిఫిక్ వంటివి ఈ ప్రమాదానికి కారణం, అలాగే ఎక్కువగా వలసలు కూడా ఈ దేశాలలోనే జరుగుతాయి.
సహారా ఆఫ్రికా ప్రజలు ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగా జీవనం గడుపుతున్నారు. దాదాపు 86 మిలియన్ మంది కి ఇదే జీవనోపాధి, వీరందరూ వలస పోవాల్సి వస్తుంది. ఇక నార్త్ ఆఫ్రికా, ఈశాన్య తునీషియా, వాయవ్య అల్ గెరియా, మొరాకో, బంగ్లాదేశ్ వంటి దేశాలలో వరదలు, నీటి కొరత కారణంగా 19 మిలియన్ల మంది వలస వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే అనుకూల వాతావరణం ఉండి కూడా ఉద్యోగం, విద్య వంటి వాటి కోసం దాదాపు 44 మిలియన్ ప్రజలు తమ సొంత గడ్డను విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా ప్రతియేటా కాలుష్య నివారణ కోసం  ఆయా దేశాలతో సదస్సులు నిర్వహించడం తప్ప కర్బన ఉద్గాతాలను అరికట్టే చర్యలకు ఎవరు అనుకున్నంతగా చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఉద్గాతాలు విడుదల చేస్తున్న దేశాలు కూడా కాలుష్య నివారణ చర్యలు లేకుండానే అభివుద్ది జాడ్యంతో పరుగులు తీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: