పిల్ల‌ల్లో పెరుగుతున్న క‌రోనా కేసులు..

Paloji Vinay
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు త‌గ్గుతున్నాయి అదే స‌మ‌యంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కరోనావైరస్ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నాయి. దేశం కోవిడ్ అత్యవసర వ్యూహాన్ని రూపొందించడంలో ప‌లు నివేదిక ల ద్వారా వంద యాక్టివ్ కేసుల్లో దాదాపు 7 మంది చిన్నారులు ఉన్నార‌ని తెలుస్తోంది. మొత్తం కోవిడ్ -19 యాక్టివ్ కేసుల్లో పిల్లల వాటా ఈ ఏడాది మార్చిలో 2.80% నుండి ఆగస్టులో 7.04% కి పెరిగింది. అయితే, పెద్దలు వైరస్ంకు గురయ్యే అవకాశం తగ్గడం వల్ల పిల్లల్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరుగుద‌ల‌కు కార‌ణం కావ‌చ్చ‌ని, ఈ ప‌రిణామంపై నిర్ల‌క్ష్యం వ‌హించ‌కూడ‌ద‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


   నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలోని జ‌రిగిన స‌మావేశానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో ఈజీ 1 నివేదిక‌లో ఉన్న విష‌యాల‌ను వెల్ల‌డించారు. నివేధిక ఆధారంగా.. 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో, ఆగస్టులో, పిల్లలలో కోవిడ్ -19 కేసులు మిజోరంలో అత్యధికంగా ఉన్నాయి (మొత్తం యాక్టివ్ కేసులలో 16.48%) మరియు ఢిల్లీలో (2.25%) అత్యల్పంగా ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు - మిజోరం (16.48%), మేఘాలయ (9.35%), మణిపూర్ (8.74%), కేరళ (8.62%), అండమాన్ మరియు నికోబార్ దీవులు (8.2%), సిక్కిం (8.02%), దాద్రా మరియు నగర్ హవేలి (7.69%) మరియు అరుణాచల్ ప్రదేశ్ (7.38%)-జాతీయ సగటు 7.04%కంటే ఎక్కువ గా పిల్ల‌ల్లో కొవిడ్ కేసులు వ‌చ్చాయి.

ఆగస్టులో జాతీయ సగటు కంటే అతి త‌క్కువ నిష్ప‌త్తిలో కోవిడ్ -19 కేసులు నమోదైన రాష్ట్రాలు పుదుచ్చేరి (6.95%), గోవా (6.86%), నాగాలాండ్ (5.48%), అస్సాం (5.04%), కర్ణాటక (4.59%), ఆంధ్ర ప్రదేశ్ (4.53%), ఒడిశా (4.18%), మహారాష్ట్ర (4.08%), త్రిపుర (3.54%) మరియు ఢిల్లీ (2.25%) నిలిచాయి. పిల్ల‌ల్లో క‌రోనా విజృంభించ‌డానికి అవ‌గాహ‌న‌, అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌డమే ప్ర‌ధాన కార‌ణంగా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: