ఆ సెంటిమెంట్‌తో టీడీపీలో ఒక్క‌టే భ‌యం ?

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుకు ఆగ‌స్ట్ ఎఫెక్ట్ వెంటాడుతోంది. వాస్త‌వానికి ఆది నుంచి కూడా ఈ పార్టీలో ఆగ‌స్టు సంక్షోభం కొన‌సాగుతోంది. ఇదే చంద్ర‌బాబుకు కూడా త‌గులుతోంది. ఈయ‌న హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చోటు చేసుకున్నాయి. సైబ‌రాబాద్ వంటి న‌గ‌రాన్ని కూడా సృష్టించారు. అదేస‌మ‌యంలో టెక్ దిగ్గ‌జాల‌ను ఏపీకి తీసుకువ‌చ్చి.. రాష్ట్రాన్ని ముందు వ‌ర‌సులో ఉండేలా చేశారు. జ‌న్మ‌భూమి కార్యక్ర‌మం, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న‌.. వంటి వినూత్న కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశారు. ఇక‌, ప‌ల్లె ప్ర‌గ‌తికి కూడా బాట‌లు వేశారు.
మ‌రీ ముఖ్యంగా విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబుకు మంచి పేరు కూడా ఉంది. అంతేకాదు.. కేం ద్రంలో ఏర్ప‌డిన ప్ర‌భుత్వాల్లోనూ చంద్ర‌బాబు చ‌క్రం తిప్పారు. ప్ర‌భుత్వ వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డం లోను.. రాష్ట్రాన్ని అగ్ర‌స్థాయిలో నిల‌బెట్ట‌డంలోనూ బాబు ముందున్నారు. అయితే.. ఇంత చేసినా.. ఆయ‌న ను ఆగ‌స్టు సంక్షోభం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఆయ‌న ఎన్ని రూపాల్లో దూకుడుగా పాల‌న‌ను ముం దుకు తీసుకువెళ్లినా.. ఆగ‌స్టు మాసం వ‌చ్చే స‌రికి మాత్రం ఇబ్బందులు.. అప‌వాదులు త‌ప్ప‌డం లేదు. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీలో 2000 సంవ‌త్స‌రంలో విద్యుత్ చార్జీల పెంపున‌కు వ్య‌తిరేకంగా పార్టీలు ఉద్య‌మిం చాయి.
ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని బ‌షీర్ బాగ్ లో ఉద్య‌మ కారుల‌పై పోలీసులు కాల్పులు జ‌రిపారు. దీంతో ఈ ఘ‌ట‌న ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబును వెంటాడుతూనే ఉంది. ఇది జ‌రిగింది ఆగ‌స్టులోనే. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఆగ‌స్టు నెల‌లో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు కూడా విక‌టించాయి. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా ఆగ‌స్టు వ‌స్తే.. `బ్లాక్ మంత్‌`గా టీడీపీ అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ.. ఆ నెల‌లో ఎలాంటి ఫ్లాగ్ షిప్ కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌డం లేదు.
అంతేకాదు.. ఆగ‌స్టు నెల‌లో ఏదైనా ప్రారంభించాల‌ని అనుకున్నా.. తాను పాల్గొన‌కుండా.. అధికారుల‌ను పంపించిన చ‌రిత్ర ఉంది. ఇక‌, ఇప్పుడు ఈ ఆగ‌స్టులో పార్టీలో మ‌రో సంక్షోభం ఏదైనా వ‌స్తుందా?  నాయ‌కులు మ‌రింత మంది పార్టీకి దూర‌మ‌వుతారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: