షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్?

praveen
ఇటీవలే ఏపీ హైకోర్టు ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా కోర్టు ధిక్కార కేసు లో ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ను అదుపు లోకి తీసుకోవాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది  గతంలోనే కృష్ణాజిల్లా కలిదిండి పంచాయతీ కార్యదర్శి అయిన శ్రీమన్నారాయణకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ మాత్రం అటు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు  ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశించిన విధంగా పంచాయతీ కార్యదర్శి శ్రీమన్నారాయణ బకాయిలు చెల్లించడం లేదు.

 ఈ క్రమంలోనే ఈ అంశం మరోసారి ఏపీ హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఇక ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గత వాయిదాకు ఆలస్యంగా హాజరు కావడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. దీంతో వెంటనే ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ ను అదుపు లోకి తీసుకోవాలి అంటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు.

 ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యే వారెంట్ రీ కాల్ కోసం ఇక ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ పెట్టిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణకు 50 వేల జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది అని హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఇక హైకోర్టు విధించిన 50 వేల జరిమానా న్యాయవాదుల సంక్షేమ నీదికి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక ఆర్థిక కార్యదర్శి కి హైకోర్టు వేసిన శిక్ష ను నిలిపివేయాలి అంటూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే ఇక సత్యనారాయణ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తామని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. లంచ్ తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: