ఈటల చాలా చిన్నోడు : కేసీఆర్

praveen
మరికొన్ని రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం హుజురాబాద్ నియోజకవర్గ పైన ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు  కానీ అప్పుడే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల వేడి ఒక రేంజ్ లో ఉంది. ఇక ఆ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునేందుకు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వ్యూహాలకు పదును పెడుతున్నారు.  ఓ వైపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లినా ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు.

 ఇక మరోవైపు కెసిఆర్ మాత్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడమే కాదు.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. అయితే ఇటీవలే కేవలం హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం దళిత బంధు పథకాలు ప్రవేశపెట్టారు అంటూ ఒక సభలో ఏకంగా అందరి ముందు చెప్పారు సీఎం కేసీఆర్ . అంతేకాదు ఈటెల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే వేగంగా  కరీంనగర్ జిల్లా జమ్మికుంట తనుగుల ఎంపీటీసీ కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఎంపిటిసి తో మాట్లాడిన ఆడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

 ఇందులో ఈటల రాజేందర్ ను ఉద్దేశిస్తూ  సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు   ఈటెల రాజేందర్ చాలా చిన్నోడు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ తో అయ్యేదికాదు పోయేది కాదు అంటూ వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. ఇక ఈటల రాజేందర్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంతో మంచిదని కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం లోని దళితులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు జరుగుతుంది అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక దళిత బందు గురించి అన్ని గ్రామాలకు తెలపాలి అంటూ ఎంపీటీసీకి సీఎం కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: