కేసీఆర్‌కు భ‌య‌ప‌డుతోందెవ‌రు... ఏపీలో ఇదే హాట్ టాపిక్ ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో దూకుడుగా ఉన్న రాయ‌ల సీమలోని వైసీపీయేత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. సీమ‌కు అన్యాయం చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మాత్రం సానుకూలంగా ఎందుకు ఉన్నారు? ఆయ‌న‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు? అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో ఉవ్వెత్తున వ‌స్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లో చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌పల్లో చిత్తూరు ఫ‌ర్వాలేద‌నుకున్నా.. మిగిలిన మూడు జిల్లాల్లో రైతులు సాగు నీటి కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. తాగునీరు అంద‌క ప్ర‌జ‌లు సైతం బాధ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ అధికారంలోకి రాగానే సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ప్లాన్ చేశారు.
అయితే.. ఈ ప్రాజెక్టు విష‌యంలో ఆది నుంచి కూడా తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. కృష్ణాజలాల‌ను తోడేస్తా రంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌..  ఈ ప్రాజెక్టును ఎట్టి ప‌రిస్థితిలోనూ ముందుకు సాగ‌నిచ్చేది లేద‌ని.. ఇటీవ‌ల అసెంబ్లీలోనూ చెప్పారు. ఇక‌, మీడియా స‌మావేశాలు. అధికారుల స‌మావేశాల్లో ఆయ‌న నిప్పులు చెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో.. అడుగడుగునా.. సీమ ప్రాజెక్టుకు కేసీఆర్ అడ్డుప‌డుతున్నారు. తాజాగా కూడా కృష్ణ రివ‌ర్ బోర్డు విష‌యంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు.
రివ‌ర్ బోర్డు అక్క‌డ త‌నిఖీలు చేయ‌డం లేద‌ని.. కాబ‌ట్టి నేరుగా ఎన్జీటీనే రంగంలోకి దిగాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. కేంద్ర బ‌ల‌గాల‌ను వినియోగించుకోవాల‌ని.. సీఎం త‌ర‌ఫున ఏఏజీ.. సూచించారు. అంతేకాదు.. కృష్ణా రివ‌ర్ బోర్డు సీమ ఎత్తిపోతల ప‌థ‌కం వ‌ద్ద నిర్వ‌హించే త‌నిఖీల‌కు అయ్యే వ్య‌యాన్ని తామే భ‌రిస్తామ‌ని.. హెలికాప్ట‌ర్‌ను సైతం స‌మ‌కూరుస్తామ‌ని.. కేసీఆర్ చెప్పారంటే.. సీమ ప్రాజెక్టుపై ఎంత‌గా క‌సి పెంచుకున్నారో .. అర్ధ‌మ‌వుతోంద‌ని సీమ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.
ఇక‌, ఈ క్ర‌మంలోనే సీమ ప్రాంత ప్ర‌జ‌లు.. సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారే త‌ప్ప‌. . కేసీఆర్‌పై ఒక్క మాట‌కూడా అన‌డం లేద‌ని.. సీమ‌కు అన్యాయం చేస్తోంద‌ని.. పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనే విష‌యం తెలిసి కూడా నేత‌లు మౌనంగా ఉంటూ.. జ‌గ‌న్‌ను ఆడిపోసుకోవ‌డం ఎందుక‌ని.. ఇక్క‌డి నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు.. స‌హా.. బీజేపీ నేత‌లు కూడా మౌనంగా ఉండ‌డాన్ని వారు నిల‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కేసీఆర్ కు భ‌య‌ప‌డుతున్న సీమ నేత‌లు .. అంటూ.. తీవ్ర‌మైన కామెంట్లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఏ ఒక్క‌రూ స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: