రాష్ట్రపతి వద్దకు విశాఖ ఉక్కు ఉద్యమం...?

విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కాస్త విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ గట్టిగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని జాతీయ నాయకులను కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ... ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరి పక్ష నేతలను కలిసాం అని తెలిపింది.
ఇంకా అనేక మంది నేతలను కలుస్తామని చెప్తూ... ఆగస్టు 2,3 తేదీల్లో జంతర్ మంతర్ లో విశాఖ పరిరక్షణ కమిటీ జరిపే ధర్నాకు సంఘీభావం తెలుపుతామని నేతలు తెలిపారని వివరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని స్పష్టం చేసారు. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తాం అని తెలిపారు. రెండు లక్షల కోట్ల ప్లాంట్ ను 30 వేల కోట్లకు ఎలా అమ్ముతారని అడగ్గా నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వలేక పోయారు అని వారు ఆరోపించారు.
ప్రైవేట్ వారికి గనులు కేటాయిస్తున్నారు అని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించడం లేదు అని ఆరోపణలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను ఆపేవరుకు పోరాడుతాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాజకీయాలు చేయాలనుకోవడం లేదు అని వారు పేర్కొన్నారు. జాతీయ ఉద్యమంగా తీసుకెళ్లాలని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాంఅని వారు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్రైవేటికరణను ఆపేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం అని వివరించారు. ఇక ఈ అంశంలో టీడీపీ కూడా కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తుంది. ఈ అంశం గురించి రాజీనామా చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: