వీడని వందేళ్ల ట్రైన్ మిస్టరీ... 106 మంది ప్రయాణికులు గల్లంతు ?

VAMSI
వీడని వందేళ్ల ట్రైన్ మిస్టరీ... 106 మంది ప్రయాణికులు గల్లంతు ? ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వందల ఏళ్లు గడుస్తున్నా అంతుచిక్కని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఒక ట్రైన్ మిస్టరీ. సాధారణంగా గాల్లో ప్రయాణిస్తున్న కొన్ని విమానాలు గల్లంతు అయ్యాయని ఎక్కడ కూలిపోయాయో , ఏ విధంగా ఆ ప్రమాదం చోటు చేసుకుందన్న వివరాలు బయటపడక  ఆశ్చర్యపోయిన వార్తలు అందరూ వినే ఉంటారు. అదేవిధంగా సముద్రంలో అదృశ్యమైన ఓడల గురించి చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. వీటి వెనుక చాలా పెద్ద కథలే ఉన్నాయంటూ కొందరు చెబుతుంటారు. ఇదే తరహాలో ఓ ట్రైన్ మిస్టరీ కూడా వందేళ్ల నుండి ఆశ్చర్యపరుస్తునే ఉంది. ఇప్పటికీ ఈ రైలు రహస్యం అంతుచిక్కడం లేదు. 1911వ సంవత్సరంలో ఇటలీలో ఒక ట్రైను అదృశ్యమైంది. 106 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఆ రైలు హఠాత్తుగా అదృశ్యమైంది. కానీ ఆ రైలు ఏమైంది, ఏ ప్రమాదానికి గురైంది అన్న వివరాలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. 


ఆ రైలుకు సంబంధించి ఆనవాళ్ళు కానీ, అందులో ప్రయాణించిన ప్రయాణికులకు కానీ ఏమైందో ఎవరికీ తెలియదు. అప్పట్లో గల్లంతైన ఈరైలు కోసం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినా రైలు ఎక్కడుందో ఏమయిందో గుర్తించలేకపోయారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కుటుంబీకులు, బంధువులు కూడా వారి ఆప్తుల  కోసం తీవ్రంగా గాలించినా లాభం లేకుండా పోయిందట. జనెట్టి అనే ఈ రైలు ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుండి 106 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఒక కిలోమీటరు పొడవున్న సొరంగం నుండి రైలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లంబార్టి అనే ఒక పర్వతాన్ని తొలగించి ఈ సొరంగాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ సొరంగంలో కి వెళ్లిన ఆ రైలు మాత్రం బయటకు రాలేదు. ఎలా అదృశ్యం అయిందో, ఆ సొరంగంలో ఎలా మాయం అయిందో ఎవరికీ అంతుపట్టలేదు. సొరంగ మార్గంలో దాని అవశేషాలు కూడా కనిపించకపోవడం గమనార్హం. అంత పెద్ద రైలు, అంత మంది జనం ఎలా మాయమయ్యారు అన్నది నేటికీ మిస్టరీగానే ఉంది. 


కానీ అదే రైలులో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు మాత్రం సొరంగం వెలుపల కనిపించారు. వాళ్ళు చెప్పిన విషయం విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతకీ వారు ఏం చెప్పారంటే.. సొరంగంలోకి రైలు ప్రవేశించగానే దట్టమైన పొగ కమ్మేసింది అని, అదే సమయంలో ఒక భయంకరమైన వింత శబ్దం వినిపించింది దాంతో భయపడి రైలులో నుండి మేము బయటకి దూకే సాము అని వారు వివరించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు చాలా మానసిక సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.  అయితే ఈ ట్రైన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉండగా, అదృష్ట శక్తులు కొన్ని ఈ రైలు టైం మిషన్ లాగా కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లాయని, దాంతో ఆ రైలును 1840 వ సంవత్సరంలో మెక్సికోకు చేరుకుందని ప్రచారంలో ఉంది. 


అంతేకాకుండా అప్పటి కాలంలో ఇందుకు సంబంధించిన ఒక పాత నివేదిక ఉంది. కొంతమంది వ్యక్తులు వింత దుస్తులు వేసుకొని కొత్తగా ఉన్నట్లు అప్పటి నివేదికలో పొందుపరిచి ఉంది. ఇటలీలో మిస్సయిన ఆ రైలు లోని ప్రజలే గతంలోకి వెళ్లారని అందుకే అప్పటి ప్రజలు ఆశ్చర్యపోయారని వార్తలు ప్రచారం జరిగాయి. ఆ రైలులో ఒక పొగాకు పెట్టె పై 1907 భవిష్యత్తు గురించి లిఖించబడి ఉందని, అది ఇప్పటికీ మెక్సికో లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ఉందని నివేదికలు తెలిపాయి. అయితే ఆ రైలు అదృశ్యమై ఇప్పటికీ వందేళ్లు గడుస్తున్నా ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా అది మిస్టరీగానే ఉండడం నిజంగా ఒక పెద్ద రహస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: