అద్భుతం : బ్లడ్‌గ్రూప్‌లు వేరైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యులు‌..!

N.ANJI
కాలంతో వచ్చే మార్పులతో పాటు జీవన విధానంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం వలన అనేక రోగాలకు గురవుతున్నారు. ఇక ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి వైద్య రంగంలోనూ సరికొత్త టెక్నలాజిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక వైద్య చరిత్రలోనే ఎప్పడు కానివి ఎరుగని రీతిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి డాక్టర్లు చరిత్ర సృష్టించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోంకు చెందిన ఆషిమ్‌ దాస్(40)కు కిడ్నీలు ఫెయిలయ్యాయి. రెండేళ్లుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. డయాలసిస్‌ లో సమస్యలు వస్తుండడంతో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ ప్రత్యామ్నాయమని డాక్టర్లు చెప్పారు. అతడి భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చినా ఇద్దరి బ్లడ్‌గ్రూప్‌లు మ్యాచ్‌ కాలేదు. అయితే ఆషిమ్‌ దాస్‌ది బి-పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కాగా ఆయన భార్యది ఎ-పాజిటివ్‌. ఆమె నుంచి కిడ్నీ తీసి అతడికి ట్రాన్స్ ‌ప్లాంట్ ‌(క్లాస్ బ్లడ్‌ గ్రూప్‌ ట్రాన్స్ ‌ప్లాంటూషన్‌) చేయడానికి వైద్యులు సిద్ధమయ్యారు.
అయితే ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన కిమ్స్‌ ఆస్పత్రి కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఇ.రవి మాట్లాడుతూ.. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలంటే డోనర్‌ను రెసిక్ట్‌ చేసే యాంటీ బాడీస్‌ పేషంట్‌ బాడీలో ఉండకూడదన్నారు. ఇక నెఫ్రాలజిస్ట్‌ హిమదీప్తితో కలిసి ప్లాస్మా ఫెరిసిస్‌ అనే ప్రక్రియ ద్వారా రోగిలో ఉన్న అలాంటి యాంటీ బాడీ‌సను క్రమంగా తగ్గించామన్నారు. ఈ ప్రక్రియకు రెండు వారాలు పట్టిందని, ఇది పూర్తయ్యేసరికి పేషంట్‌లో డోనర్‌ను వ్యతిరేకించే యాంటీ బాడీస్‌ బాగా తగ్గాయన్నారు.
ఇక కిమ్స్‌ ఆస్పత్రి చీఫ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ శర్బేస్‌ సహరియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని డాక్టర్‌ రవి తెలిపారు. అతడు ప్రస్తుతం అందరిలాగే సాధారణ జీవితం గడుపుతున్నాడన్నారు. ఏళ్లతరబడి డయాలసిస్‌ చేయించుకోలేనివారు, డయాలసిస్‌ దశ దాటిపోయి చివరి దశకు వచ్చిన రోగులకు క్రాస్‌ బ్లడ్‌ గ్రూప్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనేది ఒక వరమని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: