బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని చపాతీలు తినాలో తెలుసా..?
చపాతీ తినడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. చపాతీల లో కార్బ్స్ మాత్రమే కాదు అందులో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ కూడా లభిస్తాయి. చపాతీ లతోపాటు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చట. చపాతీలలో ఎక్కువగా విటమిన్స్ ఐరన్ కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం పొటాషియం లాంటివి ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక చపాతీలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల కడుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అయితే రోజుకు ఎన్ని చపాతీలు తినడం ద్వారా ఫలితం వుంటుందనే ఇది తెలియక చాలామంది అయోమయంలో ఉంటారు.
అయితే ముందుగా మీ రోజువారి కార్బ్ ఇంటెక్ ని ఫైనల్ చేసిన తర్వాత రోజులో ఎన్ని చపాతీలు తినాలి అనే దాన్ని డిసైడ్ చేయడానికి వీలు ఉంటుంది. ఆరు ఇంచిల చపాతీలు 71 క్యాలరీలు ఉంటాయి అంటే లంచ్ టైంలో మీరు 300 కేలరీలు తీసుకుంటారు అనుకుంటే రెండు చపాతీలు తినడం ద్వారా 140 కేలరీలు వస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మీ క్యాలరీ ఇంటెక్ ని బట్టి మీరు ఎన్ని చపాతీలు తినాలి అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ బరువు తగ్గడానికి చపాతీ తింటూ ఉంటే రోజుకు నాలుగు చపాతీలకు మంచి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే చపాతీల లో బట్టర్ ఆయిల్ వాడ కూడదు. అయితే కేవలం చపాతీలు తినడం ద్వారా వెయిట్ లాస్ జరగడం జరగదు. మీరు రోజు వారి అలవాట్లు... ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా బరువు తగ్గడం పై ఆధారపడి ఉంటాయి.