అమరావతి ఉద్యమం@ 250 : చంద్రబాబు కామెడీ మామూలుగా లేదుగా..?

Chakravarthi Kalyan
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 250 రోజులుగా ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే.. 50, 100, 150, 200, 250.. ఇలా  రోజులు పెరుగుతున్నాయే కానీ.. ఈ ఉద్యమానికి స్పందన కనిపించడం లేదు. రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు తప్ప... మిగిలిన రాష్ట్రం నుంచి పెద్దగా స్పందన లేదు. ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం అంటే.. రాష్ట్రం కదలాలి.. కానీ ఇప్పుడు ఆ 29 గ్రామాల్లోనే అంత కదలిక కనిపించడం లేదు.

ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే..  కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే దీన్ని సీరియస్ గా తీసుకుంటోంది. అప్పుడప్పడు ఆ పార్టీ నేతలే ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి అంటూ ఆవేశపడిపోతున్నారు. మొత్తానికి అమరావతి ఉద్యమం కేవలం కొన్ని గ్రామాలు, తెలుగుదేశంలోని కొందరు నాయకులకు మాత్రమే పరిమితమైన అంశంగా తయారయ్యింది. ఇది ముందు ముందు ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పోనీ.. ఈ ఉద్యమంపై అధికార పార్టీ స్పందించే అవకాశాలే కనిపించడం లేదు.

అయితే ఈ ఉద్యమం ప్రారంభించిన 250 రోజులు అయిన సందర్భంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెట్టిన ట్వీట్లు కామెడీగా ఉన్నాయి.  ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..
“ అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 250 రోజులు.దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు.ఇంత జరుగుతున్నా ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే. పైగా వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపింది.
ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోంది. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే,3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే. అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమే. ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోంది.
రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే,3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టే. అలాంటప్పుడు మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమే..
ఇవీ బాబు ట్వీట్లు.. అమరావతి ఉద్యమం దేశంలోనే అరుదైన ఉద్యమమంటున్నారు చంద్రబాబు. అంతే కాదు.. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే,3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టేనట.. బాబుగారు భలే చెప్పారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: