ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం... రైతులకు వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణం...?

Reddy P Rajasekhar
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఏపీలో రైతుల కోసం రైతు భరోసా పథకం అమలవుతుండగా తెలంగాణలో రైతు బంధు పథకం అమలవుతోంది.
 
తాజాగా ఒక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణం ఇవ్వడానికి సిద్ధమైంది. హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ బ్యాంకులు సాధారణంగా రైతులకు ఇచ్చే రుణాలపై 7 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా అన్నదాతలకు వడ్డీ లేకుండానే రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.
 
రైతులకు నేరుగా బ్యాంకులే రుణం అందించేలా చర్యలు చేపట్టామని... బ్యాంకులు అందించే రుణాలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉండగా అందులో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మిగిలిన 3 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. ఈ విధంగా రైతులకు సున్నా వడ్డీకే రుణాలు అందుతాయని తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం 17 వేల కిసాన్ మిత్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
 
కిసాన్ మిత్రాల ద్వారా రైతులకు సలహాలు, సూచనలను అందజేస్తామని పేర్కొన్నారు. రైతులు పంట వేయడానికి ముందే పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అన్నారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. హర్యానా సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు సైతం ప్రశంసిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: