తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు...?
ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 శాతం చొప్పున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. 2019 సంవత్సరం మే నెలలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏబీ)లో అధికారులు ఆరోగ్య పరీక్షల గురించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ప్రతి స్కూల్ లో పిల్లలకు ఫిట్నెస్పై ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు ట్రైనర్లను నియమించనుంది.
హెల్త్ అండ్ వెల్నెస్ డే పేరుతో వారానికి ఒకసారి టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. విద్యాశాఖ అధికారులు ఆరోగ్య కార్యక్రమాలను పాఠాలుగా బోధించేలా చర్యలు చేపట్టటంతో పాటు సిలబస్లో కూడా ఆరోగ్యపాఠాలు చేర్చే అంశాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు కేంద్రం కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన పాఠశాలలు, విద్యా సంస్థలను నవంబర్ సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 మధ్య దశల వారీగా ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది.
అధికారులు పాఠశాలల పునఃప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించనున్నట్టు చెబుతున్నారు. పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల ప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం చిన్నారులకు మాత్రం ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని సూచించనుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 256 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 615కు చేరింది.