తెలంగాణ కొత్త సెక్రటేరియట్.. అద్దిరిపోవాలె.. సీఎం కేసీఆర్ హుకుమ్..!?

Chakravarthi Kalyan

కొత్త సచివాలయం నిర్మాణంపై కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉన్నారో తెలిసిందే. ఈ మేరకు పాత సచివాలయం కూల్చివేత కూడా చాలా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైకోర్టు కూడా పాత సచివాలయం నిర్మాణాల కూల్చివేతకు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.

 


ఇప్పటికే కొత్త సచివాలయం నమూనాను తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఇక సచివాలయం నిర్మాణం శరవేగంగా జరగాలని భావిస్తున్న కేసీఆర్.. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అద్దిరిపోవాలంటూ అధికారులకు సూచించారు. 

 


తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. కొత్త సెక్రటేరియట్ బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని...  అదే సమయంలో లోపల అన్ని సౌకర్యాలతో పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని  సీఎం కేసీఆర్  అధికారులకు సూచించారు. 

 

 

అయితే.. ఈ కొత్త సచివాలయం  నిర్మాణం విషయంలో కేసీఆర్ ఇప్పటికే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ కోర్టుల్లో కేసుల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. పాత సచివాలయాలు కూల్చివేయొద్దంటూ  విపక్షాలు కోర్టులకెక్కాయి.

 


 పాత సచివాలయం బాగానే ఉన్నప్పుడు కొత్తది కట్టడం ఎందుకని వాదించాయి. చివరకు పాత సచివాలయాల కూల్చివేతపైనా కోర్టుల్లో కేసులు వేశారు. చివరకు అన్ని కేసులూ పూర్తికావడంతో ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: