ఈనాడు సంచలన కథనం: సాక్షిలో కౌంటర్ స్టోరీ..?

Chakravarthi Kalyan

ఉత్తరాంధ్ర తీరానికి సునామీ ముప్పు ఉందంటూ ఈనాడులో ప్రచురితమైన కథనం ఏపీలో కాస్త కలకలం సృష్టించింది. తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో చీలిక ఉందని.. దీని వల్ల సునామీలు వచ్చే అవకాశం ఉందని ఈనాడు కథనం రాసింది. అయితే ఇది కోటీ 60 లక్షల ఏళ్లనాడు ఏర్పాటైన చీలిక అంటూ ఈనాడు రాయడం మరో విశేషం. 

 


అయితే దీనిపై సాక్షిలో కౌంటర్ స్టోరీ వచ్చింది. ఇది ఒక విధంగా ఈనాడు స్టోరీకి సమాధానంగా ఉంది. లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన చీలికతో ప్రమాదం లేదని ఈ కథనంలో శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ చీలిక ఖండాలు ఏర్పడినప్పటిదంటున్న సైంటిస్టులు... వస్తాయో రావో తెలియని స్థితిలో చేసిన పరిశోధనల్లో ఒక ఫాల్ట్‌ లైన్‌ను గుర్తించారని వివరణ ఇచ్చారు. సముద్ర గర్భంలో అవి సర్వసాధారణమేనని తేల్చేశారు. 

 


అంతే కాదు.. తూర్పు, పశ్చిమ కోస్తా తీరాలు సురక్షితమని చెప్పారు.. ఎక్కడా భూకంపాలు, సునామీలు వచ్చే ప్రాంతాలు లేవన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారత్‌కు ఉన్న సువిశాల సముద్ర తీరం సురక్షిత ప్రాంతమని... అందులోనూ కోస్తా తీరం అత్యంత సురక్షితమని...  సముద్రాల్లో ఎప్పుడో మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడిన చీలికతో తీర భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లదని శాస్త్రవేత్తలు వివరించారు. 

 

 

ఈ అంశంపై సీఎస్‌ఐఆర్‌ –ఎన్‌ఐవో చీఫ్‌ సైంటిస్ట్‌   జి. ప్రభాకర్‌ ఎస్‌ మూర్తి ఇలా అంటున్నారు. "మనుషుల కారణంగా సముద్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే దానిపై ఎన్‌ఐవో అధ్యయనం  చేస్తోంది. డేటా ఎనలైజ్‌ చేయడం వరకే శాస్త్రవేత్త పని. ఇదే ఫైనల్‌ అని చెప్పకూడదు. మిలియన్‌ సంవత్సరాల క్రితం చిన్నపాటి చీలిక ఏర్పడిన మాట వాస్తవమే కానీ తీర భద్రతకు ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనేంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పడు ఉత్పన్నమయ్యే సమస్యలేవీ లేవు.” ఇదీ శాస్త్రవేత్తల వివరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: