వైజాగ్ గ్యాస్ లీకేజీ మీద మాటల యుద్ధాలు..... ఈ ప్రశ్నలకు సమాధానాలేవి...?

Reddy P Rajasekhar

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కంపెనీలో గ్యాస్ లీక్ అవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాలపై, ఇతర గ్రామాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ ఘటన గురించి దర్యాప్తులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. కేంద్రం కూడా విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దృష్టి పెట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
కొందరికి చర్మాలపై బొబ్బలు వస్తుండగా చిన్నారులు న్యూమోనియా లక్షణాలతో బాధ పడుతున్నారు. నిపుణులు ఈ ఘటన గురించి పలు అనుమానాలు లేవనెత్తుతూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
రాష్ట్రంలో అధికారం ఎవరి చేతిలో ఉన్నా ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఏపీలో సముద్ర తీర ప్రాంతమంతా పెట్రో రసాయనాధారిత పరిశ్రమల ఏర్పాటుకు పీసీపీఐఆర్ పాలసీ ఏర్పాటు చేశారు. దాని అమలు కొనసాగిస్తున్నారు.... ఆ విషయం విమర్శలు చేసేవారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు 
 
ఎవరైనా పర్యావరణ నియమాలు, ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడినా వాళ్లకు అభివృద్ధి నిరోధకులు అని ఎందుకు ముద్ర వేస్తున్నారు. 
 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి గత రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డ్ నివేదికల్లో అందుబాటులో ఉన్న భూములు, ఉద్యోగాలు, కోట్ల లెక్కలు మినహా అక్కడ ఉండే సహజ వనరులు, మనుషుల గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా...? 
 
మూకుమ్మడిగా ఇలాంటి పరిశ్రమలు వస్తే భవిష్యత్తులో ఎదుర్కోబోయే సామాజిక, పర్యావరణ ప్రభావాలెంటి...? ఆ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలి..? 
 
ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం సరైన కాలుష్య నిర్మూలన వ్యవస్థల ఏర్పాటు ఉందా..? లేదా...? 
 
నిరంతరం గ్యాస్ ను పరిశీలించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహించారా..? లేక యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందా..? 
 
గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసే ఫైర్ సేఫ్టీ మెకానిజం కంపెనీ దగ్గర ఉందా...? లేదా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: